Onions Reduce Blood Sugar Levels: ఉల్లిపాయలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయా?

ABN , First Publish Date - 2022-09-20T20:38:30+05:30 IST

ఉల్లిపాయల్లో ఫైబర్, ఐరెన్, విటమిన్ సి, సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రోత్సహిస్తాయి.

Onions Reduce Blood Sugar Levels: ఉల్లిపాయలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయా?

రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకునే ఆహారం, శరీర బరువు, జీవనశైలి నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా పోషకాలు ఉన్న ఆహారాన్ని,. మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, కేలరీలు అధికంగా ఉండే విధంగా తీసుకోవడం వల్ల మధుమేహంతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.


మనం రోజువారి తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ఉండే పదార్థం ఉల్లిపాయ. ఉల్లిపాయ లేని కూర తెలుగు వారికి అలవాటు ఉండదు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామత నానుడిలో ఉంది కదా! ఉల్లిపాయ కూర రుచిని పెంచడం మాత్రమే కాదు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. 


డయాబెటిస్ చికిత్సలో ఉల్లిపాయలు ఎలా సహాయపడతాయి... 

1. మనందరికీ తెలిసినట్లుగా ఉల్లిపాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేక అనారోగ్యాలను తగ్గిస్తాయి.


2. ఉల్లిపాయలలో సల్ఫర్ సమ్మేళనాలు రక్తంలో చక్కెరను తగ్గించే లక్షణాలు కలిగి ఉన్నాయని అనేక అధ్యయనాలు తెలిపాయి.


3. సాధారణంగా ఉల్లిపాయల్లో ఫైబర్, ఐరెన్, విటమిన్ సి, సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రోత్సహిస్తాయి. 


4. ఇందులోని కొన్ని రసాయనాలు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహకరిస్తాయి. ఉల్లిపాయలలో అధిక సాంద్రతలలో లభించే ఫ్లేవనాయిడ్, యాంటీ ఆక్సిడెంట్ , క్వెర్సెటిన్, మధుమేహా లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. 

Updated Date - 2022-09-20T20:38:30+05:30 IST