Abn logo
Sep 27 2021 @ 01:43AM

డేటా సైన్స్‌తో మాస్టర్స్‌ చేయవచ్చా?

టెలీకామ్‌ ఇంజనీరింగ్‌తో గ్రాడ్యుయేషన్‌ పూర్తయింది. డేటా సైన్స్‌ పట్ల ఆసక్తి ఉంది. కొన్ని సర్టిఫికెట్‌ కోర్సులు చేయాలని అనుకుంటున్నాను. గ్రాడ్యుయేషన్‌లో వేరే బ్రాంచ్‌ చదివాను కదా, డేటాసైన్స్‌తో మాస్టర్స్‌ చేయడానికి వీలు అవుతుందా? యూకే, అమెరికా, జర్మనీలో మంచి యూనివర్సిటీల్లో చేరాలని అనుకుంటున్నాను?

- వైష్ణవి, సికింద్రాబాద్‌

వివరాలు ఇవిగో

ఏ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న విద్యార్థులైనా డేటా సైన్స్‌ చదవడానికి అర్హులే. అమెరికా, జర్మనీ యూనివర్సిటీలో చదవాలంటే మంచి జీపీఏ, ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్‌/ పీటీఈలలో ఏదో ఒకదానిలో మంచి స్కోరు, జీఆర్‌ఈలో 320 కంటే ఎక్కువ స్కోరు సాధించాల్సి ఉంటుంది. యూకేలో చదవాలంటే జీపీఏ కంటే ఐఈఎల్‌టీఎస్‌లో మార్కులే ముఖ్యం.