May 11 2021 @ 11:42AM

కీర్తికి అక్కడైనా హిట్ దక్కేనా..?

మలయాళంలో మోహన్ లాల్ నటిస్తున్న 'మరక్కార్' సినిమాలో కీర్తి హీరోయిన్‌గా నటిస్తోంది. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె శాస్త్రీయ సంగీతకళాకారణి ఆర్చా పాత్రలో కనిపించబోతోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజయిన కీర్తి లుక్‌కు పాజిటివ్ రెస్పాన్ వచ్చింది. అయితే ఈ మధ్య కీర్తి సురేష్‌కు సరైన హిట్ దక్కలేదు. గత ఏడాది ఈమె నటించిన 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' సినిమాలు వచ్చి నిరశాపరచాయి. ఈ ఏడాది నితిన్‌తో నటించిన 'రంగ్ దే' కూడా యావరేజ్‌గా నిలిచింది. దాంతో మళయాళంలో నటిస్తున్న 'మరక్కార్‌'తో అయినా కీర్తికి హిట్ దక్కేనా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట', రజనీకాంత్ నటుస్తున్న 'అన్నాత్తే' సినిమాలు చేస్తోంది.