చల్లటి పానీయాలు తీసుకోవచ్చా?

ABN , First Publish Date - 2020-04-25T06:33:31+05:30 IST

అప్పుడప్పుడు కొంచెం వాన కురుస్తున్నా, ఎండ మాత్రం ఎక్కువగానే ఉంది. ఇంట్లో ఉన్నా కూడా ఎక్కువ వేడి వల్ల దాహం, చెమటతో సతమతమవుతున్నాం. ఒకవైపు కరోనా ఉంది కదా... చల్లనీళ్లు, చల్లటి

చల్లటి పానీయాలు తీసుకోవచ్చా?

అప్పుడప్పుడు కొంచెం వాన కురుస్తున్నా, ఎండ మాత్రం ఎక్కువగానే ఉంది. ఇంట్లో ఉన్నా కూడా ఎక్కువ వేడి వల్ల దాహం, చెమటతో సతమతమవుతున్నాం. ఒకవైపు కరోనా ఉంది కదా... చల్లనీళ్లు, చల్లటి పానీయాలు తాగొచ్చా? ముఖ్యంగా చిన్నపిల్లలను ఆపలేకపోతున్నాం. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించండి

విజయలక్ష్మి, హైదరాబాద్‌

మీరు గమనించాల్సిన ముఖ్య విషయం... చల్లటి పానీయాలు తీసుకుంటే కరోనా రాదు. కరోనా రాకుండా పాటించాల్సిన జాగ్రత్తలు మాత్రం తప్పక తీసుకోండి. ఎండల వల్ల డీ హైడ్రేషన్‌ ఉంటుంది. ఇంట్లో ఉన్నా కూడా పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. చల్లటి పానీయాలు తీసుకోవడం వల్ల రిలీ్‌ఫగా ఉంటుంది కాబట్టి వాటి వైపే మొగ్గుచూపుతారు. అయితే చల్లటి పానీయాలు కొంతమంది పిల్లలకు పడకపోవచ్చు. అలాంటివారు నార్మల్‌ కూల్‌తో తీసుకోవచ్చు. వేసవిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... మూత్రం డార్క్‌గా మారకుండా చూడాలి. మూత్రం రంగు పల్చగా (లైట్‌ పసుపు రంగులో ఉంటుంది) ఉండేట్టు ఎక్కువగా నీళ్లు, పానీయాలు తీసుకుంటూ ఉండాలి. ఎండాకాలం కొందరికి ముక్కు నుంచి రక్తం కూడా వస్తుంది. వీరు కూడా ఎక్కువ నీరు తాగాలి. అలాగే ఫ్యాన్‌ గాలి డైరెక్ట్‌గా ముక్కుకు తగలకుండా చూసుకోవాలి.


వేడిని తట్టుకునేందుకు రెండు హెల్దీ పానీయాలివి...

హెర్బల్‌ మజ్జిగ: చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, నాలుగు కరివేపాకులు, తగినంత ఉప్పు, ఒక కప్పు పెరుగు... వీటన్నింటినీ బాగా బ్లెండ్‌ చేసి, నాలుగు గ్లాసుల నీళ్లు పోసి సిద్ధం చేసుకోవాలి. దీనిని ఫ్రిజ్‌లో పెట్టి రోజుకు కనీసం రెండు సార్లు తీసుకోవాలి.

సబ్జా గింజలతో: రెండు టీ స్పూన్ల సబ్జా గింజలు, రెండు నిమ్మకాయల రసం, చిటికెడు ఉప్పు, అరకప్పు షుగర్‌ సిరప్‌, నాలుగు గ్లాసుల నీళ్లు. ముందుగా సబ్జాగింజలను అరకప్పు నీళ్లలో నానబెట్టాలి. వీటిలో మిగతావి కలిపి ఫ్రిజ్‌లో పెట్టి రోజుకు రెండుసార్లు తాగాలి. మధుమేహం ఉన్నవారు షుగర్‌ సిరప్‌ బదులుగా కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు.  

ఇవి కాకుండా ఫ్రూట్‌ జ్యూసులు, వెజిటబుల్‌ జ్యూసులు, సూప్స్‌, రసం, సాంబార్‌, పప్పుచారు, స్మూతీస్‌... ఇవన్నీ కూడా మనం తీసుకునే ఆహారంలో నీటి శాతాన్ని పెంచుతాయి. వీటితో పాటు రెగ్యులర్‌గా నీళ్లు తాగాలి. రోజుకు రెండుసార్లు స్నానం చేయడం వల్ల చర్మం హైడ్రేట్‌ అవుతుంది. 


ఎండల వల్ల డీ హైడ్రేషన్‌ ఉంటుంది. ఇంట్లో ఉన్నా కూడా పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది.


డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌

drjanakibadugu@gmail.com 

Updated Date - 2020-04-25T06:33:31+05:30 IST