Advertisement
Advertisement
Abn logo
Advertisement

వాకింగ్‌కు ముందు ఏమైనా తినాలా?

ఆంధ్రజ్యోతి(23-04-2021)

ప్రశ్న: నాకు నలభై అయిదేళ్లు. రోజూ బ్రిస్క్‌ వాకింగ్‌ చేస్తాను. ఇలా నడకకు వెళ్లే ముందు ఏమైనా ఆహారం తిని వెళ్తే మంచిదా?


- వాసుదేవ్‌, కడప


డాక్టర్ సమాధానం: ఈ వయసు వారు రోజూ నలభై నిమిషాలు వాకింగ్‌ చేయడం మంచిది. పరగడుపున లేదా కేవలం నీళ్లు మాత్రమే తాగి వాకింగ్‌కు వెళ్తే నీరసం అనిపించొచ్చు. అందుకే ఉదయం వాకింగ్‌కు వెళ్లే పావుగంట  ముందు ఓ పండు లేదా రెండు ఖర్జూరాలు, పది ఎండు ద్రాక్ష ల్లాంటివి తీసుకుంటే మీరు నడుస్తున్న సమయానికి తగిన శక్తి లభిస్తుంది. ఇక సాయంత్రం పూట నడకకు ప్రత్యేకించి ముందుగా ఏమి తీసుకోనక్కరలేదు కానీ అవసరమనిపిస్తే నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బూజ లాంటివి కొన్ని ముక్కలు తిని వెళ్ళవచ్చు. ఎండాకాలంలో వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి వేడికి చెమట ద్వారా శరీరంలోని నీరు, లవణాలు కోల్పోతాం. దీనివల్ల డీహైడ్రేట్‌ అయ్యే అవకాశాలున్నాయి. దీన్ని నివారించడానికి, వాకింగ్‌కు వెళ్ళేటప్పుడు చిన్న బాటిల్లో నీళ్లు తీసుకొని వెళ్లడం మంచిది. తిరిగి వచ్చిన వెంటనే టీ, కాఫీలకు బదులుగా కొబ్బరినీళ్లు, చక్కెర కలపని నిమ్మరసం మొదలైనవి తీసుకోవచ్చు. 


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement