కూల్ డ్రింక్స్‌తో బరువు పెరుగుతారా?

ABN , First Publish Date - 2021-03-27T19:25:34+05:30 IST

కెలోరీలు తక్కువగా తీసుకోవాలనుకునే వారు మాములు కూల్‌డ్రింక్స్‌లకు ప్రత్యామ్నాయంగా డైట్‌ సోడాలు తీసుకోవడం సాధారణం. డైట్‌ సోడాల్లో తీపి కోసం చక్కెరకు బదులుగా ఆస్పర్టెమ్‌, సైక్లమేట్‌, సాకారిన్‌, సుక్రలోజ్‌ మొదలైన కృత్రిమ తీపి పదార్థాలను వాడతారు. చక్కెర, కెలోరీలు

కూల్ డ్రింక్స్‌తో బరువు పెరుగుతారా?

ఆంధ్రజ్యోతి(27-03-2021)

ప్రశ్న: డైట్‌ కూల్‌ డ్రింక్స్‌ మంచివేనా? వీటి వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుందా?


- మేఘ, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: కెలోరీలు తక్కువగా తీసుకోవాలనుకునే వారు మాములు కూల్‌డ్రింక్స్‌లకు ప్రత్యామ్నాయంగా డైట్‌ సోడాలు తీసుకోవడం సాధారణం. డైట్‌ సోడాల్లో తీపి కోసం చక్కెరకు బదులుగా ఆస్పర్టెమ్‌, సైక్లమేట్‌, సాకారిన్‌, సుక్రలోజ్‌ మొదలైన కృత్రిమ తీపి పదార్థాలను వాడతారు. చక్కెర, కెలోరీలు లేకుండా ఉన్నప్పటికీ, కృత్రిమ స్వీటెనర్లను కలిగి ఉండడం వల్ల ఈ డైట్‌ సోడాల వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. వీటిలో కెలోరీలు లేకపోవడమే కాక ఎటువంటి పోషకాలు ఉండవు కూడా. డైట్‌ సోడా తాగడం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. గర్భంతో ఉన్నప్పుడు డైట్‌ సోడా తాగడం వల్ల పుట్టే బిడ్డలో ఊబకాయం లాంటి కొన్ని ప్రతికూల సమస్యలు ఏర్పడవచ్చు. డైట్‌ సోడాలు పెద్ద పేగుల్లో ఉండే మంచి బాక్టీరియాపై ప్రభావం చూపిస్తాయి. అందుకే మధుమేహ వ్యాధి సోకే ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. అన్ని కూల్‌డ్రింక్స్‌లాగే వీటిలో కూడా ఫాస్ఫరస్‌ అధికంగా ఉంటుంది. కాబట్టి ఎముకలు గుల్లబారడం, దంతాల ఎనామెల్‌కు హానికలగడం లాంటి సమస్యలు సమీప భవిష్యత్తులో తలెత్తవచ్చు. 


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-03-27T19:25:34+05:30 IST