ఇంజెక్షన్‌తో బరువు తగ్గొచ్చా?

ABN , First Publish Date - 2022-03-04T01:39:29+05:30 IST

ఒక ఇంజెక్షన్ లేదా ట్యాబ్లెట్‌తో బరువు తగ్గే అవకాశం ఉందా? నిజంగా అలాంటి డ్రగ్ ఉందా? ఒకవేళ ఉంటే నిజంగా పనిచేస్తుందా?

ఇంజెక్షన్‌తో బరువు తగ్గొచ్చా?

ఒక ఇంజెక్షన్ లేదా ట్యాబ్లెట్‌తో బరువు తగ్గే అవకాశం ఉందా? 

నిజంగా అలాంటి డ్రగ్ ఉందా? ఒకవేళ ఉంటే నిజంగా పనిచేస్తుందా?

ఈ విషయంలో సైన్స్ ఏం చెబుతోంది.. తెలుసుకోవాలనుకుంటే ఇది చదవాల్సిందే.


సెమాగ్లూటైడ్.. టైప్-2 డయాబెటిస్ చికిత్సలో వాడే ఒక ఔషధం. ఇది ఇంజెక్షన్ రూపంలో ఉండేది. దాదాపు రెండేళ్ల క్రితం నుంచే అందుబాటులో ఉన్న ఈ ఇంజెక్షన్ ఇప్పుడు ట్యాబ్లెట్ రూపంలో కూడా అందుబాటులోకి వచ్చింది. మనదేశంలో కూడా ఇటీవలే ఈ ట్యాబ్లెట్‌కు అనుమతి లభించింది. డయాబెటిస్ చికిత్సలో వాడే ఈ ఔషధం బరువు తగ్గడంలో ఉపయోగపడుతుందా?


సైన్స్ ఏం చెబుతోంది..

సెమాగ్లూటైడ్.. ఇది గ్లూకజాన్ లేదా గ్లూకజాన్ లైక్ పెప్టైడ్ 1 (జీఎల్‌పీ-1) హార్మోన్‌గా కూడా పనిచేస్తుంది. ఈ హార్మోన్ ఆహారం తీసుకునేటప్పుడు, త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది. దీంతో తక్కువ ఆహారం తీసుకోగానే కడుపు నిండినట్లు అనిపించి, అతిగా తినకుండా ఉంటారు. అందువల్ల సెమగ్లూటైడ్ ఇంజెక్షన్ లేదా ట్యాబ్లెట్ తీసుకున్న వాళ్లు రెగ్యులర్‌కంటే తక్కువ ఆహారం తీసుకుంటారు. దీనివల్ల క్యాలరీలు తగ్గి, బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. గత ఏడాది 1961 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 

మన దగ్గర దొరుకుతుందా?

ప్రస్తుతం ఈ ఔషధం మన దేశంలో కూడా లభిస్తోంది. అయితే, కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌పై ఉన్నవాళ్లు మాత్రమే ఈ డ్రగ్ తీసుకునే వీలుంది. అది కూడా టైప్-2 డయాబెటిస్ పేషెంట్లకు మాత్రమే డాక్టర్లు ఈ ఔషధాన్ని సూచిస్తున్నారు.


జాగ్రత్తగా ఉండాల్సిందే

బరువు తగ్గించడంలో సాయపడుతుందేమో కానీ, ఇది వెయిట్ లాస్ మెడిసిన్ కాదనే విషయాన్ని గుర్తించాలి. క్యాలరీలు తక్కువ తీసుకునేలా మాత్రమే చేస్తుంది. దీనివల్ల క్రమంగా బరువు తగ్గుతారు. టైప్-1 డయాబెటిస్ పేషెంట్లు కూడా దీన్ని వాడటానికి వీల్లేదు. డాక్టర్ల సూచనమేరకే దీన్ని వాడాలి. అలాగే డ్రగ్ తీసుకున్న తర్వాత వాంతులు, మలబద్ధకం, కడుపునొప్పి, జ్వరం వంటి ఇతర సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ల సలహా లేకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ డ్రగ్ తీసుకోరాదు.

Updated Date - 2022-03-04T01:39:29+05:30 IST