Abn logo
Apr 11 2021 @ 23:49PM

నిధులున్నా రహదారి నిర్మించరేం..?

  గిరిజనుల ధర్నా

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 11: నారింజపాడు రోడ్డు నిర్మాణానికిగాను రూ.4.96 కోట్లు నిధులున్నా ఇప్పటివరకు ఎందుకు నిర్మించడం లేదని కరడవలస, నారింజపాడు గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈమేరకు ఆదివారం స్థానిక సీపీఎం నేత కోరాడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో కరడవలస సమీపంలో ధర్నా చేశా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధులున్నా గిరిజన ప్రాంతాల పట్ల చిన్నచూపుతో పనులు ప్రారంభించడం లేదని ఆరోపించారు. జిల్లేడువలసకు గత ప్రభుత్వ హయాంలోనే రూ.3 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభించి, వదిలేశా రన్నారు. ఈ రెండు రోడ్లు తక్షణమే నిర్మించాలని గిరిజనులు కోరారు. ఈ కార్యక్ర మంలో సీదరపు అప్పారావు, సంగయ్య తదితరులు పాల్గొన్నారు. 

 

 

Advertisement
Advertisement
Advertisement