రాజకీయ ఖైదీల్ని రక్షించుకోలేమా?

ABN , First Publish Date - 2021-07-09T06:14:36+05:30 IST

ఆదివాసీ హక్కుల కార్యకర్త స్టాన్ స్వామిని అక్రమ కేసులో ఇరికించి, బెయిలు రాకుండా చేసి, అనారోగ్యంతో మరణించేలా చేయడం అన్యాయం...

రాజకీయ ఖైదీల్ని రక్షించుకోలేమా?

ఆదివాసీ హక్కుల కార్యకర్త స్టాన్ స్వామిని అక్రమ కేసులో ఇరికించి, బెయిలు రాకుండా చేసి, అనారోగ్యంతో మరణించేలా చేయడం అన్యాయం. అణగారిన వర్గాల ప్రజల గొంతుకై, వారి సంక్షేమం కోసం పాటుపడిన స్టాన్ స్వామికి సకాలంలో సరైన చికిత్స కూడా అందించకపోవడం రాజ్య ఉన్మాదానికి నిదర్శనం. 


నాయకులు, అధికారగణం వ్యవహరించే తీరు పౌర సమాజానికి బలమైన సందేశానిస్తుంది. రాజ్యాంగబద్ధమైన ప్రజల హక్కుల్ని స్వయంగా కాపాడవల్సిన వారే, అప్రజాస్వామికంగా వ్యవహరించడం, వ్యవస్థని నిర్దేశించాల్సినవారే అక్రమంగా ప్రవర్తించడం దారుణం. రాజకీయ నేరస్థుల పేరుతో హక్కుల నేతలు, సామాజిక కార్యకర్తలపై జరుగుతున్న కుట్రకేసుల్ని సమూలంగా ఎత్తివేసే దిశగా ప్రగతిశీల శక్తులన్నీ ఒక బలమైన ఐక్య కార్యాచరణ నిర్మించాలి. మతోన్మాదం, ఆధిపత్య రాజకీయాలు పెచ్చరిల్లుతున్న వేళ దేశంలోని అనేక జైళ్ళల్లో అన్యాయంగా మగ్గిపోతున్న రాజకీయ ఖైదీల జీవించే హక్కుకై అభిప్రాయభేదాలకి అతీతంగా గొంతు విప్పడం కనీస బాధ్యత. ఈ విషయాన్ని పౌర సమాజంలోని అన్ని స్రవంతులు ఇకనైనా ఆలోచించాలి.

గౌరవ్, రవికాంత్

Updated Date - 2021-07-09T06:14:36+05:30 IST