ప్రగతి కళాశాలలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు రేపు

ABN , First Publish Date - 2021-03-01T05:30:00+05:30 IST

బీ.ఎస్సీ కెమిస్ర్టీతోపాటు బీ.కామ్‌, బీ.ఏ, బీ.ఫార్మసీ, ఎమ్మెస్సీ కెమిస్ర్టీ, ఆర్గానిక్‌, ఎనలైటికల్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులైన యువకులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించను న్నారు.

ప్రగతి కళాశాలలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు రేపు

కొత్తవలస: బీ.ఎస్సీ కెమిస్ర్టీతోపాటు బీ.కామ్‌, బీ.ఏ, బీ.ఫార్మసీ, ఎమ్మెస్సీ కెమిస్ర్టీ, ఆర్గానిక్‌, ఎనలైటికల్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులైన యువకులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించను న్నారు. ఈ నెల 3న కొత్తవలసలోని ప్రగతి డిగ్రీకళాశాల ప్రాంగణంలో స్కిల్‌ కనెక్ట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.సాయిశ్రీనివాస్‌ తెలిపారు. హెటిరో డ్రగ్స్‌ కంపెనీ ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను వారి కంపెనీలో ఉద్యోగాల నిమిత్తం ఎంపిక చేసుకుంటారన్నారు.


Updated Date - 2021-03-01T05:30:00+05:30 IST