Abn logo
Nov 29 2020 @ 00:08AM

6న బీవీ రాజు కాలేజీలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు

భీమవరం ఎడ్యుకేషన్‌, నవంబరు 28 :  బీవీ రాజు కళాశాలలో డిసెంబరు 6న డాక్టర్‌ రెడ్డీస్‌ లెబొరేటరీ లిమిటెడ్‌ వారు 2019–20 సంవత్సరాలలో డిగ్రీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లో 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత పొందిన పురుషులకు ఉద్యోగ రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తున్నారని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీహెచ్‌ వి.శ్రీనివాస్‌ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జనన ధ్రువీకరణ పత్రం లేదా టెన్త్‌ ఉత్తీర్ణత పత్రం, 2019లో ఉత్తీర్ణులైన వారు సంబంధిత సర్టిఫికెట్లు, రెండు ఫొటోలు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌తో బయోడేటాను అభ్యర్థులు తీసుకురావాలన్నారు. వివరాలకు లెక్చరర్‌ కె.సత్యనారాయణరాజు 94400 72682 నంబరులో సంప్రదించాలన్నారు.

Advertisement
Advertisement
Advertisement