‘నారాయణ’లో ప్రాంగణ ఎంపికలు

ABN , First Publish Date - 2021-01-21T03:14:10+05:30 IST

స్థానిక నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాలలో బుధవారం ఇసుజు కంపెనీ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎం

‘నారాయణ’లో ప్రాంగణ ఎంపికలు
ఎంపికైన విద్యార్ధులతో కంపెనీ, కళాశాల ప్రతినిధులు

గూడూరు, జనవరి 20: స్థానిక నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాలలో బుధవారం ఇసుజు కంపెనీ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించినట్లు కళాశాల మేనేజింగ్‌  సెక్రటరీ వినయ్‌కుమార్‌ తెలిపారు. కళాశాలలో ఆయన మాట్లాడుతూ శ్రీసిటీకి చెందిన ఇసుజు కంపెనీ ఆధ్వర్యంలో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ గ్రూపు విద్యార్థులకు నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో తమ కళాశాలకు చెందిన 80మంది విద్యార్ధులు ఎంపికయ్యారన్నారు. వీరికి వార్షిక వేతనం రూ. 2లక్షల వరకు ఉంటుందన్నారు. అలాగు కంప్యూటర్‌సైన్స్‌, ఎలకా్ట్రనిక్‌, ఎంసీఏ గ్రూపు విద్యార్థులకు టార్గెట్‌ఇంటిగ్రేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించగా 27మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. వీరికి రూ. 5లక్షలు వార్షికవేతనం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఏవీఎస్‌ప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ విశ్వక్‌సేనారెడ్డి, ప్లేస్‌మెంట్‌ అధికారి హేమంత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T03:14:10+05:30 IST