ఆధ్యాత్మిక చింతన ద్వారానే మనిషికి ప్రశాంతత

ABN , First Publish Date - 2022-05-21T04:23:34+05:30 IST

ఆధ్యాత్మిక చింతన ద్వారా మనిషికి ప్రశాంతత ఏర్పడుతుందని త్రిదండి చిన జీ యర్‌స్వామి అన్నారు.

ఆధ్యాత్మిక చింతన ద్వారానే మనిషికి ప్రశాంతత
భక్తులనుద్దేశించి మాట్లాడుతున్న త్రిదండి చినజీయర్‌స్వామి

- త్రిదండి చినజీయర్‌స్వామి


తిమ్మాజిపేట, మే 20: ఆధ్యాత్మిక చింతన ద్వారా మనిషికి ప్రశాంతత ఏర్పడుతుందని త్రిదండి చిన జీ యర్‌స్వామి అన్నారు. తిమ్మాజిపేట మండల పరిధి లోని రాళ్లచెరువుతండాలో శుక్రవారం త్రిదండి చినజీ యర్‌స్వామి ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి విగ్రహం గరుడ ఆంజనేయస్వామి, ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించారు. త్రిదండి చిన జీయర్‌స్వామికి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. గోవిందనామస్మరణ తో రాళ్లచెరువుతండా మారుమోగింది. స్వామి విగ్రహా లకు ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఆధ్యాత్మిక చింతన అలవాటు చేసుకోవడం తో పాటు దురలవాట్లు దూరమవుతాయన్నారు. భక్తి ద్వారా మనిషికి ముక్తి లభిస్తుందని అందరూ ఆధ్యా త్మికత అలవాటు చేసుకోవాలన్నా రు. ఆధ్యాత్మికత అలవాటు చేసు కోవడం ద్వారా బాధలు అన్ని దూరమవుతాయని ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. ప్రతీ మనిషి ఎదుటి మనిషితో ప్రేమ గా ఉండాలని ప్రేమిస్తూ జీవిం చాలని ద్వేషం మనలో ఉండ కూడదన్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, భక్తు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 


 పాద పూజ

 తాడూరు: మండలంలోని పాపగల్‌ గ్రామాన్ని శుక్రవారం చినజీయర్‌స్వామి సందర్శించారు. ఈ సంద ర్భంగా గ్రామానికి చెందిన జగదీశ్వర్‌రెడ్డి ఆహ్వానం మే రకు వచ్చి వారి దంపతులచే పాదపూజ కార్యక్రమం అనంతరం గ్రామంలోని ఆంజనేయస్వామి, రామాల య ప్రాంగణంలో కొంతసేపు గడిపారు. ఈ సంద ర్భంగా పాల్గొన్న భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం స్వామి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు భగవత్‌ నామస్మరణతో ముందుకు సాగాలన్నారు.  

Updated Date - 2022-05-21T04:23:34+05:30 IST