ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-24T05:44:52+05:30 IST

పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నిర్మల్‌ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి.

ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం
పరీక్షా కేంద్రంలో కలెక్టర్‌ పరిశీలన

కేంద్రాలు సందర్శించిన కలెక్టర్‌

9,626 విద్యార్థుల హాజరు

నిర్మల్‌ కల్చరల్‌, మే 23 : పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నిర్మల్‌ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు 9,719 విద్యార్థులకు గాను 9,626 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ డీఈవో రవీందర్‌ రెడ్డితో కలిసి పరిశీలించారు. దిలావర్‌పూర్‌, కుంటాల ఆదర్శ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతం, పరీక్ష రాసే తీరు కలెక్టర్‌ పరిశీలించారు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచిస్తూ అప్రమత్తంగా ఉండాలని నిర్వాహకులను ఆదేశించారు. స్థానికంగా ఉన్న గౌతమ్‌ మాడల్‌ స్కూల్‌, బాలికల ఆశ్రమ పాఠశాల కస్బా కేంద్రాలను డీఈవో రవీందర్‌ రెడ్డి సందర్శించారు. 

కుంటాల, మే 23 : మండల కేంద్రంలోని ఆదర్శపాఠశాలలో నిర్వహిస్తున్న పదిపరీక్షలను సోమవారం కలెక్టర్‌ ముషారఫ్‌అలీఫారూఖీ పరిశీలించారు. విద్యా ర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండాచర్యలు తీసుకోవాలని నిర్వా హకు లకు సూచించారు. విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌ కాపీయింగ్‌కు పాల్పడ కుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ కలీం, డీపార్ట్‌మెంటల్‌ అధికారి రవీందర్‌రెడ్డి, చీఫ్‌సూపరిండెంట్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌ లున్నారు.

దిలావర్‌పూర్‌, మే 23 : పదవతరగతి పరీక్షాకేంద్రాల్లో అసౌకర్యాలకు తావు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. సోమవారం దిలావర్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాల పరీక్షాకేంద్రా న్ని జిల్లా కలెక్టర్‌ తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని వసతులు కల్పిం చాలని, ఓఆర్‌ఎస్‌ కలిపిన తాగునీటిని అందించాలని అన్నారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా ఇన్విజిలెటర్లు చర్యలు చేప ట్టాలని అన్నారు. అలాగే కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, పరీక్షాకేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు, మెడికల్‌ క్యాంప్‌, ఓఆర్‌ ఎం షీట్‌, హాజరు రిజిస్టర్‌, ప్రశ్నపత్రాలు కలెక్టర్‌ పరిశీలించారు. ఆర్‌డీవో గాజుల తుకారాం, విద్యాశాఖ అధికారి రవీందర్‌, తహసీల్దార్‌ కలీం ఉన్నారు.

Updated Date - 2022-05-24T05:44:52+05:30 IST