Abn logo
Sep 27 2021 @ 00:37AM

ప్రశాంతంగా ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష హాజరైన విద్యార్థులు


చింతపల్లి, సెప్టెంబరు 26: మండల కేంద్రంలో ఆదివారం ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, గూడెంకొత్తవీధి మండలాల విద్యార్థులకు చింతపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన ప్రవేశ పరీక్షకు 50మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉన్నప్పటికి 39 మంది హాజరయ్యారని చీఫ్‌ ఎగ్జామినర్‌ పనసల ప్రసాద్‌ తెలిపారు.