ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2022-05-17T04:51:23+05:30 IST

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.

ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షలు
ధరూరులోని పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న నోడల్‌ అధికారి హృదయరాజు

- ప్రథమ సంవత్సరం ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ పరీక్షలకు 4,142 మంది హాజరు

గద్వాల టౌన్‌/అయిజ, మే 16 : ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన ప్రథమ సంవత్సరం ఫిజిక్స్‌-1, ఎకనామిక్స్‌-1 పరీక్షలకు 4,142 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 కేంద్రాల్లో 3,765 మంది జనరల్‌, 669 మంది వృత్తివిద్య కోర్సులతో కలిసి మొత్తం 4,434 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 292 మంది గైర్హాజరయ్యారు. గద్వాల పట్టణంలోని ఆరు కేంద్రాల్లో 1,578 మంది జనరల్‌,  434 మంది వృత్తి విద్య కోర్సులతో కలిపి మొత్తం 2,012 మందికి గాను 1,894 మంది హాజరుకాగా 118 మంది పరీక్ష రాయలేదు. అయిజలోని మూడు కేంద్రాల్లో 1,016 మందికి గాను 919 మంది పరీక్ష రాశారు. 97 మంది పరీక్షకు రాలేదు. ధరూరు కేంద్రంలో 339 మందికి గాను 327 మంది పరీక్షకు హాజరయ్యారు. మల్దకల్‌ కేంద్రంలో 97 మందికి గాను 88 మంది,  గట్టులో 297 మందికి గాను 284 మంది, అలంపూరు కేంద్రంలో 498 మందికి గాను 468 మంది, మానవ పాడు కేంద్రంలో 175 మందికి గాను, 162 మంది పరీక్ష రాశారు. 77 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంతో పాటు ధరూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, అయిజలోని హరిహర జూనియర్‌ కళాశాల, మల్దకల్‌  ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి హృదయరాజు తనిఖీ చేశారు. 

Updated Date - 2022-05-17T04:51:23+05:30 IST