Abn logo
Aug 7 2020 @ 00:00AM

ప్రశాంతంగా నస్పూర్‌ మున్సిపల్‌ కో ఆప్షన్‌ ఎన్నిక

నస్పూర్‌. ఆగస్టు 6: నస్పూర్‌ మున్సిపాలిటీ  మున్సి పల్‌ ప్రత్యేక సమావేశం చైర్మన్‌ ఈసంపల్లి ప్రభాకర్‌ అధ్యక్షతన కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఇందులో టీఆర్‌ ఎస్‌కు చెందిన వారే ఎన్నికయ్యారు. నాలుగు కోఆప్షన్‌ స్థానాలకు 12 మంది దరఖాస్తులు చేసు కున్నారు. గురువారం జరిగిన ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీ పార్టీకు చెందిన కౌన్సిల్‌ సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు.


ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు (ఎక్స్‌ ఆఫీసియో సభ్యులు), టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 13 మంది, ఇద్దరు సీపీఐ కౌన్సిలర్లు సమావేశానికి హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌కు చెందిన ముత్తె రాజే శం (తీగల్‌పహాడ్‌), పెరుమాళ్ళ భాగ్యలక్ష్మి (సింగపూర్‌), మహ్మద్‌ నాసర్‌ (తాళ్ళప ల్లి), సయ్యద్‌ ఖదీరున్నీసా బేగం (నస్పూర్‌ కో ఆప్షన్‌ సభ్యులుగా ఎన్ను కున్నారు. సమావేశానికి సీపీఐ ఇద్దరు కౌన్సిలర్లు హాజరైనప్పటీకీ ఓటింగ్‌ లో పాల్గొన లేదు.  ఎన్ని కైన సభ్యులకు కమిషనర్‌ రాధా కిషన్‌ ఎన్నిక పత్రాలను అందజేశారు.  తెలంగాణ తల్లి చౌర స్తా వద్ద కౌన్సిలర్లను చైర్మన్‌ ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌  శ్రీనివాస్‌, వంగ తిరుపతి సన్మానించారు. 

Advertisement
Advertisement