Abn logo
Oct 30 2020 @ 19:01PM

తుఫాన్‌కు ముందు.. అంటూ పెళ్లికి ముందు కాజల్‌

Kaakateeya

స్టార్‌ సెలబ్రిటీల పెళ్లి జరుగుతుంది అంటే.. ఎటువంటి వాతావరణం ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే కరోనా ఎఫెక్ట్‌తో గప్‌చుప్‌గా ఈ మధ్య టాలీవుడ్‌ హీరోలు కొందరు తమ పెళ్లిళ్లు కానిచ్చేశారు. ఇప్పుడు వారి లిస్ట్‌లోకి స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ కూడా చేరబోతోంది. లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు వచ్చిన తరుణంలో ఒకరకంగా కాజల్‌ పెళ్లి వైభవంగానే జరుగుతోంది. అక్టోబర్‌ 30న ఆమె గౌతమ్‌ కిచ్లూతో ఏడడుగులు వేయబోతోంది. ఇక ఈ పెళ్లి సంబరాల్లో ఇరు కుటుంబ సభ్యులు బిజీ బిజీగా గడుపుతున్నారు. కాజల్‌ కూడా గురువారం డ్యాన్స్‌లు, నవ్వులతో సోషల్‌ మీడియాని షేక్‌ చేసింది. కానీ పెళ్లంటే ఆడపిల్లకి ఉండే భయం.. ఇప్పుడామెను ఆవహించింది.

అదెలా అనుకుంటున్నారా? తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన పిక్‌ చూసిన వారెవరైనా సరే.. ఇదే మాట చెబుతారు. 'తుఫాన్‌కి ముందు ఉండే నిశ్శబ్ధం' అని తెలుపుతూ.. కామ్‌గా కూర్చుని ఉన్న పిక్‌ని కాజల్‌ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన వారంతా.. పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్ల మనసులో ఇటువంటి నిశ్శబ్దమే ఉంటుందని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక కాజల్‌ సహనటీమణులు రకుల్‌, తమన్నా వంటి వారు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లుగా కామెంట్స్‌లో తెలిపారు. రియల్‌ హీరో సోనూసూద్‌.. పార్టీ బాకీ ఉన్నావ్‌.. గుర్తుపెట్టుకో.. అని తెలుపుతూ.. కాజల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కాజల్‌ షేర్‌ చేసిన ఈ ఫొటో వైరల్‌ అవుతుంది.


Advertisement
Advertisement