కాల్‌ లింక్స్‌ న్యూ ఫీచర్‌

ABN , First Publish Date - 2022-10-01T06:19:06+05:30 IST

ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త హంగులతో యూజర్లను సంతృప్తిపరిచే వాట్సాప్‌ నుంచి ‘కాల్‌ లింక్స్‌’ ఫీచర్‌ వస్తోంది.

కాల్‌ లింక్స్‌  న్యూ ఫీచర్‌

ప్పటికప్పుడు ఏదో ఒక కొత్త హంగులతో యూజర్లను సంతృప్తిపరిచే వాట్సాప్‌ నుంచి ‘కాల్‌ లింక్స్‌’ ఫీచర్‌ వస్తోంది. ఆడియో, వీడియో కాల్స్‌ రెంటికీ నేరుగా లింక్‌ ఈ ఫీచర్‌తో క్రియేట్‌ కానుంది. అలాగే అతి త్వరలో 32 మంది పార్టిసిపెంట్స్‌తో ఎన్‌క్రి్‌ప్టడ్‌ వీడియో కాల్‌కు కూడా సన్నాహాలు చేస్తోంది. కాల్‌ లింక్స్‌ కూడా మామూలు కాల్‌ మాదిరిగానే ఉంటుంది. అయితే కాల్‌లో ఉన్న మెంబర్లు ఇతరులను కూడా ఈ ఫీచర్‌తో కలుపుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫారాలపై వాట్సాప్‌ చాట్‌ లిస్ట్‌ - కాల్స్‌ టాబ్‌లో ఇది కనిపించనుంది. షెడ్యూల్డ్‌ లేదంటే ఇన్‌స్టాంట్‌ అదీ వాయిస్‌ వీడియో కాల్స్‌లో స్నేహితులు, బంధువులు, ఇతర వ్యక్తులకు ఏ సమయంలోనైనా చేయవచ్చు. ఈ కాల్‌ లింక్స్‌ను 90 రోజుల్లో ఉపయోగించుకోని పక్షంలో ఈ సదుపాయం ముగిసిపోతుంది. ఈ లింక్‌ అక్కర్లేదని అనుకునే వారు యాప్‌ డౌన్‌లోడింగ్‌కు రీడైరెక్ట్‌ అవుతారు. 32 మందితో ఎన్‌క్రిప్టెడ్‌ కాల్‌ ఈ ఏప్రిల్‌ నుంచే టెస్టింగ్‌లో ఉంది. ప్రస్తుతం ఎనిమిది మందితోనే ఈ సదుపాయం ఉంది. అయితే వాట్సాప్‌ పోటీదారు టెలిగ్రామ్‌ వెయ్యిమందికి అవకాశం కలుగజేస్తోంది. అలాగే వాట్సాప్‌ ఇటీవలే ‘కమ్యూనిటీస్‌’ ఫీచర్‌ను సైతం టెస్టింగ్‌లో ఉంచింది. ఇది అందుబాటులోకి వస్తే, అడ్మిన్‌లు మల్టిపుల్‌ గ్రూపులతో కమ్యూనిటీని క్రియేట్‌ చేయవచ్చు. 


అప్డేట్‌... క్విక్‌

వాట్సాప్‌ ఈ నెల 23న రెండు బగ్‌లను కనుగొంది. దరిమిలా వినియోగదారులంతా పాత వెర్షన్‌ నుంచి కొత్త వెర్షన్‌కు మారాలని సూచిస్తోంది. సెక్యూరిటీ అడ్వయిజరీస్‌ పేజీలో వాట్సాప్‌ ఈ మేరకు వివరణ ఇచ్చింది. సీవీఈ-2022-36934, సీవీఈ-2022-27492 పేరిటఉన్న ఈ రెండూ ఆండ్రాయిడ్‌, ఐఓఎ్‌సలలో వాట్సాప్‌ అలాగే బిజినె్‌సకు ఎఫెక్ట్‌ అయ్యాయి. వీటిలో మొదటిది 10 పాయింట్స్‌పై 9.8 రెండో 7.8తో హైరి్‌స్కనే కలిగి ఉన్నాయని కూడా పేర్కొంది. ఈ రెండు బగ్స్‌ కూడా బ్యాడ్‌ యాక్టర్‌ని అనుమతించి ఎర్రర్‌కు పాల్పడతాయి. ఎస్టాబ్లిష్డ్‌ వీడియో కాల్‌ లేదా స్పెషల్లీ క్రాఫ్ట్‌డ్‌ వీడియో ఫైల్‌తో జొరబడతాయి.  ఈ నేపథ్యంలో తక్షణం న్యూ వెర్షన్‌కు మారాలని వాట్సాప్‌ సూచించింది.

Updated Date - 2022-10-01T06:19:06+05:30 IST