California లోని ఎన్నారైలూ.. జర జాగ్రత్త.. ఇలా చేస్తే ఇకపై అస్సలు తప్పించుకోలేరు..!

ABN , First Publish Date - 2022-05-10T23:03:49+05:30 IST

Californiaలోని ఎన్నారైలూ.. జర జాగ్రత్త..పెద్ద శబ్దం చేసే కార్లలో రయ్యని దూసుకుపోదామనుకుంటే ఇకపై కుదరదు. రాష్ట్రం ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే కెమెరాలు..

California లోని ఎన్నారైలూ.. జర జాగ్రత్త.. ఇలా చేస్తే ఇకపై అస్సలు తప్పించుకోలేరు..!

ఎన్నారై డెస్క్: Californiaలోని ఎన్నారైలూ.. జర జాగ్రత్త..పెద్ద శబ్దం చేసే కార్లలో రయ్యని దూసుకుపోదామనుకుంటే ఇకపై కుదరదు. రాష్ట్రం ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే కెమెరాలు.. ఇలాంటి కార్లను క్షణంలో ఫొటోలు తీసి వాహనదారుల బండారం మొత్తం బయట పెట్టేస్తాయి. శబ్దకాలుష్యం తగ్గించే క్రమంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వాహనాల శబ్దం ఆధారంగా యాక్టివేట్ అయ్యే కెమెరాలను రహదారుల పక్కన ఏర్పాటు చేయనుంది. పైలట్ ప్రోగ్రామ్ కింద ఐదేళ్ల పాటు ఈ కార్యక్రమం చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు కాలిఫోర్నియా రాష్ట్ర సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో తొలి విడతగా ఐదు నగరాలు పాల్గొంటాయి. ఇందుకు కోసం అధికారులు ప్రత్యేకమైన కెమెరాలను సిద్ధం చేశారు. కార్ల శబ్దం పరిమితిని దాటితే ఈ కెమెరాలు వెంటనే యాక్టివేట్ అవుతాయి. ఆ తరువాత.. వాటి లైసెన్సు ప్లేట్‌ను స్పష్టంగా ఫొటో తీస్తాయి. 


అయితే.. కార్లు, మొటర్‌సైకిళ్ల శబ్దాల మధ్య వ్యత్యసాన్ని ఈ కెమెరాలు ఎలా గుర్తిస్తాయి అన్న విషయంలో ఇంకా స్పష్ట లేదు. అంతేకాకుండా.. రహదారిపై ఉన్న అనేక కార్లలో ఎక్కువ శబ్దం చేసే కారను కచ్చితంగా ఎలా పసిగడతాయనే దానికూడా కొంత అస్పష్టత నెలకొంది. ఇక తాజా నిబంధనల ప్రకారం.. ఇటువంటి కెమెరాలు ఉన్న ప్రాంతాల్లోకి వెళుతున్న సందర్భంలోనే డ్రైవర్లను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ అవుతాయి. అయితే.. తొలిసారి కెమెరాకు చిక్కిన వారికి జరిమానా విధించకుండా ఉండేందుకు అధికారులు నిర్ణయించారు. పదే పదే తప్పుచేసే వారు మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక ఈ ప్రోగ్రామ్‌లో పాలు పంచుకునే నగరాలేవో ఇంకా వెల్లడి కాలేదు. కాలిఫోర్నియా రాష్ట్ర నిబంధనల ప్రకారం.. 1985 తరువాత వచ్చిన కార్ల మోడళ్ల శబ్ద తీవ్ర 95 డెసిబెల్స్ దాటకూడదు. మోటర్ సైకిళ్ల విషయంలో ఈ పరిమితి 80 డెసిబెల్స్‌గా ఉంది. 



Read more