America లో మనోళ్ల ప్రీ వెడ్డింగ్ ధూమ్ ధామ్.. విపరీతమైన శబ్దాలంటూ ఫిర్యాదు రావడంతో పోలీసులు వెళ్తే..

ABN , First Publish Date - 2022-05-11T01:57:02+05:30 IST

అమెరికాలో మనోళ్ల ప్రీ వెడ్డింగ్ ధూమ్ ధామ్.. విపరీతమైన శబ్దాలంటూ ఫిర్యాదు రావడంతో పోలీసులు వెళ్తే..

America లో మనోళ్ల ప్రీ వెడ్డింగ్ ధూమ్ ధామ్.. విపరీతమైన శబ్దాలంటూ ఫిర్యాదు రావడంతో పోలీసులు వెళ్తే..

ఎన్నారై డెస్క్: ఆ ఇంట్లో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ జరుగుతోంది! ఇల్లంతా సందడి.. స్నేహితులు, బంధువులతో అంతా కోలాహలంగా ఉంది! త్వరలో ఆ కుటుంబంలో పెళ్లి జరగబోతుండడంతో.. ఈ వేడుకను ఏర్పాటు చేసుకున్నారు. ఇంతలో ఎవరో తలుపు కొడుతున్నట్టు చప్పుడు. గుమ్మం వద్దకు వెళ్లి చూడగా.. ఎదురుగా ఇద్దరు పోలీసులు. దీంతో.. ఆ కుటుంబం ఒక్కసారిగా షాకైపోయింది.  ఇటీవల అమెరికాలోని ఓ భారతీయ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితి. పోలీసుల రాకతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. అందరిలోనూ టెన్షన్! విపరీతమైన శబ్దాలంటూ ఫిర్యాదు అందడంతో వచ్చామని వారు చెప్పారు. అయితే..  కొద్ది క్షణాల తరువాత సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.  పోలీసులు ఆ వేడుకల్లోనే పాల్గొని అక్కడున్న వారితో కలిసి డ్యాన్స్ చేశారు.  అంతా వింతగా ఉంది కదూ..! అసలు ఏం జరిగిందంటే..


మన్‌ప్రీత్ సింగ్ తన కుటుంబంతో కలిసి కాలిఫోర్నియాలోని ట్రేసీ నగరంలో నివసిస్తుంటారు.  ఆయన తమ్ముడి వివాహం నిశ్చయమవడంతో.. మన్‌ప్రీత్ సింగ్ ఏప్రిల్ 13న తన ఇంట్లో ఓ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. పంజాబీ స్టైల్లో.. గానాబజానా మధ్య ధూంధాంగా ఈ వేడుక సాగింది. రాత్రి 10 గంటలు దాటినా వాళ్ల కోలాహలం తగ్గలేదు. దీంతో.. చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్ద శబ్దాల కారణంగా తమకు ఇబ్బంది కలుగుతోందని పేర్కొన్నారు. దీంతో.. పోలీసులు మన్‌ప్రీత్ ఇంటికి చేరుకున్నారు. వారి రాకతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా సీరియస్‌గా మారిపోయింది. అయితే..మ్యూజిక్ శబ్దం తక్కువ చేయాలని పోలీసుల సూచించడంతో వారు వెంటనే అంగీకరించారు. 


అయితే.. పోలీసులకు కూడా వారు ఓ చిన్న కండీషన్ పెట్టారు. తమతో పాటూ ఆ వేడుకలో పాల్గొనాలని షరతు విధించారు. భారతీయుల వెడుకల గురించి వారికి తెలిసుండడంతో వారు కూడా ఓకే చెప్పారు. అయితే.. ఆ ఇద్దరు పోలీసులకు పంజాబీ స్టైల్ డ్యాన్స్ రాకపోవడంతో.. మన్‌ప్రీత్ ఇంట్లో వాళ్లు స్వయంగా రెండు స్టేప్పులు నేర్పించారు. ఇంకేముంది.. వాళ్లు చెప్పినట్టుగా చిందేసిన పోలీసులు ఆ వేడుకను ఓ ఆసక్తికర మలుపు తిప్పారు. వారు డ్యాన్స్ చేస్తుండగా తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘‘పంజాబీ కుటుంబంలోని వేడుకకు హాజరైన వారెవరైనా డ్యాన్స్ చేయకుండా ఉండగలరా’’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే..సౌండ్ తగ్గించేందుకు వారు ఒప్పుకున్నాకే తాము ఈ వేడుకల్లో పాలు పంచుకున్నామంటూ స్థానిక పోలీసుల సోషల్  మీడియాలో పేర్కొన్నారు. ఈ వైరల్ వీడియో కారణంగా లేనిపోని అపోహలు తలెత్తకుండా వారు ఇలా వివరణ ఇచ్చారు. 





Read more