కందిపంట సాగు విస్తీర్ణంపై రీసర్వే

ABN , First Publish Date - 2020-02-20T05:40:57+05:30 IST

కందిపంట విస్తీర్ణంపై జిల్లా వ్యవసాయాధికారి మరోసారి రీ సర్వే చేపట్టారు. బుధవారం తాండూరు మండలం పర్వతాపూర్‌ గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి గోపాల్‌ ఆధ్వర్యంలో

కందిపంట సాగు విస్తీర్ణంపై రీసర్వే

తాండూరు రూరల్‌ : కందిపంట విస్తీర్ణంపై జిల్లా వ్యవసాయాధికారి మరోసారి రీ సర్వే చేపట్టారు. బుధవారం తాండూరు మండలం పర్వతాపూర్‌ గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి గోపాల్‌ ఆధ్వర్యంలో రైతులతో సమీక్షించారు. తాండూరు మండలంలోని ఆయా గ్రామాల్లో కందిపంట విస్తీర్ణం ఎంత? ఎంతమంది రైతులు పంట సాగు చేశారు? ఎంత దిగుబడి వచ్చిందనే విషయాలపై పర్వతాపూర్‌ గ్రామంలో పర్యటించి క్షేత్రస్థాయిలో రైతులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. పర్వతాపూర్‌ గ్రామంలో 130 మంది రైతులు 716 ఎకరాల్లో పంటసాగు చేసినట్లు రైతులు తెలిపారు. గతంలో సర్వే చేసిన దానికి, ఇప్పటికి కొంత తప్పులు దొర్లినందున మరోసారి సర్వే చేయాల్సి వచ్చిందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. వ్యవసాయ ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటసాగు చేసిన సర్వే వివరాలను సరిగ్గా నమోదు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఏవో రజిత తదితరులున్నారు.19 : టీడీఆర్‌ : 01 :-వివరాలు సేకరిస్తున్న అధికారి గోపాల్‌

Updated Date - 2020-02-20T05:40:57+05:30 IST