Bengal post poll violence: సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2021-08-19T17:37:45+05:30 IST

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండ కేసులపై సీబీఐ విచారణ జరిపించాలని కోల్‌కత్తా హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది....

Bengal post poll violence: సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం

కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండ కేసులపై సీబీఐ విచారణ  జరిపించాలని కోల్‌కత్తా హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల అనంతరం బెంగాల్ రాష్ట్రంలో జరిగిన అత్యాచారాలు, హత్య కేసులపై సీబీఐ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. పశ్చిమబెంగాల్ లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండకు సంబంధించిన పిల్ లను  కోల్‌కత్తా హైకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విన్నది. అత్యాచారాలు, హత్య కేసులను కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరపాలని హైకోర్టు సూచించింది. ఇతర కేసులను సుమన్ బోరా సాహు, మరో ఇద్దరు పోలీసు అధికారుల నేతృత్వంలోని సింట్ దర్యాప్తు చేయాలని కోల్‌కత్తా హైకోర్టు ఆదేశించింది.కోర్టు ఆదేశం లేకుండా ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోరాదని కలకత్తా హైకోర్టు తెలిపింది.


Updated Date - 2021-08-19T17:37:45+05:30 IST