నేడే కేబినెట్‌ భేటీ

ABN , First Publish Date - 2020-03-27T07:40:00+05:30 IST

రోనా కారణంగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఆర్డినెన్స్‌ ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను అమల్లోకి తేవాలని...

నేడే కేబినెట్‌ భేటీ

  • బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు ఆమోదం

అమరావతి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఆర్డినెన్స్‌ ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను అమల్లోకి తేవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిది. సదరు ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపేందుకు శుక్రవారం సచివాలయంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షత రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. దానిపై ఆమోదముద్ర వేశాక గవర్నర్‌కు పంపనున్నారు. ఆయన ఆమోదం తెలిపితే ఆర్డినెన్స్‌ ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీనివల్ల అన్ని రకాల ప్రభుత్వ చెల్లింపులకు ఆస్కారం ఉంటుంది. 12 నెలల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో 3 నెలలకు అంటే ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు ఆమోదం తీసుకునేలా ఆర్డినెన్స్‌ సిద్ధం చేయనున్నారు. 



Updated Date - 2020-03-27T07:40:00+05:30 IST