అమరావతి: ఏపీ మంత్రివర్గ భేటీ ముగిసింది. కీలక బిల్లులకు మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు ఆమోదం తెలిపింది. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంపునకు కేబినెట్ అంగీకారం తెలిపింది. కరోనా కట్టడిపై సుదీర్ఘంగా చర్చించింది. కేబిబినెట్ చివరిలో ఉద్యోగుల డిమాండ్లపై మంత్రులతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది.