క్యాబేజీ చనా దాల్‌

ABN , First Publish Date - 2022-03-11T19:19:50+05:30 IST

క్యాబేజి- ఒకటి, శనగలు- అర కప్పు, పచ్చి కొబ్బరి- అర కప్పు, ఉల్లి ముక్కలు- అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు- అయిదు, కరివేపాకు- రెండు రెబ్బలు,

క్యాబేజీ చనా దాల్‌

కావలసిన పదార్థాలు: క్యాబేజి- ఒకటి, శనగలు- అర కప్పు, పచ్చి కొబ్బరి- అర కప్పు, ఉల్లి ముక్కలు- అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు- అయిదు, కరివేపాకు- రెండు రెబ్బలు, పచ్చి మిర్చి- ఒకటి, పసుపు- అర స్పూను, కారం- అర స్పూను, ఆవాలు, జీలకర్ర- అర స్పూను, కొత్తిమీర తరుగు- స్పూను, ఇంగువ- చిటికెడు, ఉప్పు, నూనె, నీళ్లు- తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా శనగల్ని గంట పాటు  నానబెట్టాలి. పాన్‌లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర చిటపటలాడించి ఇంగువ, ఉల్లి, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు కలిపి వేయించాలి. దీంట్లోనే క్యాబేజీ, పచ్చి శెనగలు, మిర్చి వేసి బాగా కలిపి మూత పెట్టాలి. అవసరమైతే అర కప్పు నీళ్లు కూడా వేయొచ్చు. క్యాబేజీ సగం ఉడికాక కొబ్బరి కలిపి మళ్లీ మూతపెట్టాలి. అయిదు నిమిషాల తరవాత స్టవ్‌ కట్టేసి పైన కొత్తిమీర తురుము చల్లాలి.

Updated Date - 2022-03-11T19:19:50+05:30 IST