Abn logo

క్యాబేజీ వడలు

కావలసిన పదార్థాలు: క్యాబేజీ - పావు కేజీ, శనగపప్పు - ముప్పావు కప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు - ఒక టేబుల్‌ స్పూను చొప్పున, కరివేపాకు తరుగు - అరకప్పు, ఉప్పు - రుచికి సరిపడా, కారం, గరం మసాలా - అర టీ స్పూను చొప్పున, కొత్తిమీర తరుగు - అరకప్పు, బియ్యప్పిండి - పావు కప్పు, నూనె - వేగించడానికి సరిపడా.


తయారుచేసే విధానం: ఒక తపేలాలో నీరుపోసి మరిగించి విడదీసిన క్యాబేజీ ఆకులు వేసి 3 నిమిషాల తర్వాత తీసి చల్లనీటిలో ముంచి ఆరబెట్టాలి. 4 గంటలు నానబెట్టిన శనగపప్పులో పావు కప్పు పక్కనుంచి మిగతాది మిక్సీలో బరకగా రుబ్బాలి. ఒక పాత్రలో క్యాబేజీ ఆకుల తరుగు, పక్కనుంచిన శనగపప్పు,  రుబ్బిన శనగపప్పు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు, ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర, బియ్యప్పిండి  వేసి గట్టిగా నీరు  పోయకుండా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్ది మిశ్రమం తీసుకుని వడలుగా వత్తి బాగా కాగిన నూనెలో వేసి దోరగా వేగించాలి.


అలసంద వడలుకార్న్‌ పనీర్‌ సమోసాస్వీట్ కార్న్ వడలు (వీడియో)కంద దోశలుపనీర్‌ టిక్కాఆలూ బాల్స్‌పోహా కట్‌లెట్‌ఫైబర్ ప్రోటీన్ దోశ (వీడియో)చల్ల పునుగులు (వీడియో)వెజ్ శాండ్విచ్ (వీడియో)
Advertisement
Advertisement