Ola Cab: ఓటీపీ చెప్పలేదనే కారణంతో రెచ్చిపోయిన క్యాబ్ డ్రైవర్.. అందరినీ కిందకు దించేసి మరీ..

ABN , First Publish Date - 2022-07-10T21:31:30+05:30 IST

ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. సమస్య చిన్నదైనా ప్రాణాలు తీసేందుకు వెనుకాడడం లేదు. తాజాగా చెన్నైలో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ ఓటీపీ..

Ola Cab: ఓటీపీ చెప్పలేదనే కారణంతో రెచ్చిపోయిన క్యాబ్ డ్రైవర్.. అందరినీ కిందకు దించేసి మరీ..

ఈ మధ్య కాలంలో చిన్న చిన్న  విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. సమస్య చిన్నదైనా ప్రాణాలు తీసేందుకు వెనుకాడడం లేదు. తాజాగా చెన్నైలో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ ఓటీపీ చెప్పలేదని ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డాడు.


ఇండియాలో ప్రముఖ నగరాలన్నిటిలోనూ క్యాబ్‌ సర్వీసులు మొదలయ్యాయి. సిటీలలో ఎక్కడికైనా వెళ్లాలి అంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ కంటే క్యాబ్‌లకే మొగ్గుచూపుతున్నారు. అదే విధంగా చెన్నైలోని కన్నివాక్కంకు చెందిన ఉమేందర్‌ కుటుంబ సభ్యులతో సినిమా చూసేందుకు ఓలా క్యాబ్ బుక్‌ చేశాడు. వారిని పికప్ చేసుకునేందుకు క్యాబ్ డ్రైవర్ రవి అక్కడికి చేరుకున్నాడు. అయితే ఓటీపీ చెప్పకుండా వారు కారులో ఎక్కేసరికి, రవికి ఆగ్రహం వచ్చింది. ముందు ఓటీపీ చెప్పి తర్వాత క్యాబ్ ఎక్కాలని వారిని దించేశాడు. అంతేకాకుండా ఏడుగురు ఉన్నందున ఉమేందర్ కారు బదులు ఎస్‌యూవీ బుక్ చేసి ఉండాల్సిందని రవి చెప్పాడు. దీంతో రవి, ఉమేందర్ మధ్య మాటామాటా పెరిగింది.

TALIBAN: తాలిబన్ల కారును ఇన్నేళ్లకు తవ్వి తీశారు.. అసలు ఏం జరిగిందంటే..


ఆ తర్వాత క్యాబ్‌ డ్రైవర్‌ ఉమేందర్‌ తలపై ఫోన్‌తో గట్టిగా కొట్టాడు. అంతేకాక పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఉమేందర్ స్పృహ తప్పి కిందపడిపోయాడు. వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. మరోవైపు తప్పించుకునేందుకు ప్రయత్నించిన క్యాబ్‌ డ్రైవర్‌ రవిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఓటీపీ విషయంలో చెలరేగిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని తీసిందని ఉమేందర్‌ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మహిళ ఒక్కటే ఉందని మాస్టర్ ప్లాన్ వేశారు.. ఇంట్లోకి వెళ్లిన కాసేపటికి ఏం జరిగిందంటే..

Updated Date - 2022-07-10T21:31:30+05:30 IST