సీఏ కోర్సులో విజయం సాధించాలంటే.. ఇలా చదవండి..!

ABN , First Publish Date - 2021-10-11T15:50:31+05:30 IST

సీఏ కోర్సు అనేది..

సీఏ కోర్సులో విజయం సాధించాలంటే.. ఇలా చదవండి..!

సీఏ ఫైనల్‌.. ర్యాంకర్స్‌ వాయిస్‌ 


సీఏ కోర్సు అనేది కొంత మందికే సాధ్యం. సీఏ చదవాలంటే ఎన్నో సంవత్సరాలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలనే నానుడి ఉంది. కానీ, కృత నిశ్చయం ఉండి విశ్లేషణాత్మకత, సమయస్ఫూర్తి ఉంటే ఈ కోర్సును ఎవరైనా పూర్తి చేయగలరు అంటున్నారు ఇటీవలి సీఏ-ఫైనల్‌ ఫలితాల్లో ఆల్‌ఇండియా ర్యాంకులు సాధించిన ‘మాస్టర్‌మైండ్స్‌’ విద్యార్థులు. వారి విజయ రహస్యాలు, వారికి దోహదపడిన అంశాలు, ఈ కోర్సులో విజయం సాధించాలనుకునే వారికి సలహాలు, సూచనలు వారి మాటలలోనే.....



పేరు: రియా గోయల్‌

ఊరు: గుంటూరు

తండ్రి పేరు: సర్‌మోర్‌ ప్రసాద్‌ గోయల్‌(వ్యాపారం)

తల్లి పేరు: నీతా గోయల్‌ (గృహిణి)

పదో తరగతి: 10/10 (జీపీఏ)

ఇంటర్మీడియట్‌ (ఎంఈసీ): 96.8 (జీపీఏ)

సీఏ-సీపీటీ: 192 మార్కులు 

సీఏ ఇంటర్‌: 584 మార్కులు, ఆల్‌ఇండియా 37వ ర్యాంకు 

సీఏ ఫైనల్‌: 537 మార్కులు, ఆల్‌ఇండియా 43వ ర్యాంకు (2021 సెప్టెంబరు)


ఐసీఏఐ  స్టడీ మెటీరియల్‌ తప్పనిసరి

నేను 10వ తరగతి వరకు గుంటూరులో చదివాను. సీఏ చేయాలనే కోరిక మొదటి నుంచిఉంది. అందుకే ఇంటర్‌లో కామర్స్‌ అండ్‌ అకౌంట్స్‌ సబ్జెక్టులు ఉన్న ఎంఈసీ గ్రూపు తీసుకున్నాను. తరవాత సీఏ కోర్సులో జాయిన్‌ అయ్యాను. సీఏ కోర్సులోని మొదటి దశ సీఏ-సీపీటీలో 192 మార్కులు వచ్చాయి. తరవాత దశ అయిన సీఏ-ఇంటర్‌లో మొదటి ప్రయత్నంలోనే 584 మార్కులతో ఆల్‌ఇండియా 37వ ర్యాంకు సాధించాను. ఇప్పుడు సీఏ ఫైనల్‌లో 537 మార్కులతో ఆల్‌ఇండియా 43వ ర్యాంకు సాధించాను. సీఏ కోర్సుని తక్కువ ఖర్చుతో పూర్తిచేయవచ్చు. ఈ కోర్సు దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉంటుంది. ఒకేసారి వివిధ రకాల పుస్తకాలను చదివి గందరగోళ పరిస్థితిని ఎదుర్కునే బదులు మొదటి నుంచి ఒకే మెటీరియల్‌ను పదే పదే పునశ్ఛరణ చేయటం మంచిది. సీఏ కోర్సులో అన్ని సబ్జెక్టుల్లో 60% మార్కులు సాధించాలంటే ఐసీఏఐ వారి స్టడీ మెటీరియల్‌ తప్పనిసరిగా చదవాలి. ముఖ్యంగా అంకితభావం, క్రమశిక్షణ, నిజాయితీ అనేవి నా విజయ రహస్యాలుగా నేను భావిస్తాను.



పేరు: ఎస్‌.అఖిల్‌ నందన్‌ 

ఊరు: భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా.

తండ్రి పేరు: నాన్న అచ్యుతరామయ్య(వ్యాపారం)

తల్లి పేరు: గీత

పదో తరగతి:  10/10 (జీపీఏ)

ఇంటర్మీడియట్‌ (ఎంఈసీ): 955 మార్కులు

సీఏ-సీపీటీ: 195 మార్కులు 

సీఏ ఇంటర్‌: 511 మార్కులు 

సీఏ ఫైనల్‌ : 541 మార్కులు, ఆల్‌ఇండియా 40వ ర్యాంకు (2021 సెప్టెంబరు ఫలితాలు)


క్విక్‌ రివిజన్‌ నోట్స్‌ మస్ట్

10వ తరగతి వరకు భీమవరంలో చదివాను. సి.ఏ చదవాలనే ఆశయంతో ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపు ఎంచుకొని  మాస్టర్‌మైండ్స్‌లో జాయిన్‌ అయ్యాను.  సీఏ-సీపీటీలో 195 మార్కులు సాధించాను. సీఏ-ఇంటర్‌లో 511 మార్కులు సాధించాను. ఇప్పుడు సీఏ ఫైనల్‌లో 541 మార్కులతో ఆల్‌ఇండియా 40వ ర్యాంకు సాధించాను.


నా విజయాలలో ఇన్‌స్టిట్యూట్‌ పాత్ర చాలా కీలకమైనది. నేను సీఏ-సీపీటీ నుంచిసీఏ ఫైనల్‌ వరకు  కోచింగ్‌లో ఇచ్చిన రివిజన్‌ ఎగ్జామ్స్‌, స్టడీ అవర్స్‌ షెడ్యూల్స్‌ను అనుసరించాను. అవి నాకు ఆల్‌ఇండియా ర్యాంకు తెచ్చుకోవటంలో తోడ్పాటును అందించాయి. సీఏ చదవాలంటే టాలెంట్‌, తెలివితేటలు బాగా ఉండాలని ఏమీలేదు. కష్టపడేతత్వం, పటిష్ఠమైన ప్రణాళిక, సమయపాలన, తప్పులను సరిదిద్దుకోవటం వంటివి ఉంటే చాలు ఎవరైనా విజయం సాధించవచ్చు.  సీఏ ఫైనల్‌లో ముందుగానే ప్రతి సబ్జెక్ట్‌కు క్విక్‌ రివిజన్‌ నోట్స్‌ తయారు చేసుకోవటం వల్ల పరీక్షలలో విజయం సాధించటానికి ఎంతగానో సహకరించాయి. ఐఐటీకి పెట్టే ఖర్చుతో పోలిస్తే సీఏ చదవటానికి వ్యయం చాలా తక్కువ. సీఏ ఫైనల్‌కి రోజుకి 12 నుంచి 14 గంటలు చదివేవాడిని. సన్నద్ధత సమయంలో  100ు సిలబస్‌ పూర్తిచేయలేకపోయినా భయపడవద్దు. కనీసం 70ు-80ుసిలబస్‌ పూర్తిచేయగలిగినా ఉత్తీర్ణత సాధించే అవకాశముంది. ప్రాథమిక, ముఖ్యమైన అంశాలు చదవటం మరిచిపోవద్దు. 

Updated Date - 2021-10-11T15:50:31+05:30 IST