425 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-11-01T10:37:02+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శనివారం 425 మందికి వైరస్‌ సోకింది. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు బాధితులు మరణించారు.

425 మందికి కరోనా

 ముగ్గురు మృతి ఫ 505 మంది డిశ్చార్జి


విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శనివారం 425 మందికి వైరస్‌ సోకింది. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు బాధితులు మరణించారు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 39,324 చేరుకున్నాయి. కరోనా మరణాలు అధికారికంగా 566కు పెరిగాయి. కొవిడ్‌ ఆసుపత్రుల నుంచి 505 మంది బాధితులు కోలుకుని ఇంటికి చేరుకోగా, ఇంకా 3,165 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


మరో నాలుగు కంటైన్మెంట్‌ జోన్లు

విజయవాడ సిటీ : జిల్లాలో కొత్తగా మరో నాలుగు కంటైన్మెంట్‌ జోన్లను కలెక్టర్‌ ఇంతియాజ్‌ శనివారం ప్రకటించారు. ఘంటసాల మండలంలోని లంకపల్లి, పెదపారుపూడి మండలంలోని ఈదులమద్దాలి, రెడ్డిగూడెం మండలంలోని తాడిగూడెం, జి.కొండూరు మండలంలోని కందులపాడు గ్రామాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదుకావడంతో వైరస్‌ వ్యాప్తి నివారణకు ఆయా ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్‌ నిబంధనలను అమలు చేస్తామని తెలిపారు.

Updated Date - 2020-11-01T10:37:02+05:30 IST