టన్ను చెరకుకు రూ.3,125 మద్దతు ధర

ABN , First Publish Date - 2020-10-31T08:30:16+05:30 IST

2020-21 సీజన్‌కు కేసీపీ చక్కెర కర్మాగార పరిధిలో చెరకు సరఫరా చేసే రైతులకు టన్నుకు రూ.3,125 చెల్లించేందుకు నిర్ణయించినట్టు యాజమాన్యం శుక్రవారం ప్రకటించింది.

టన్ను చెరకుకు రూ.3,125 మద్దతు ధర

ఉయ్యూరు, అక్టోబరు 30: 2020-21 సీజన్‌కు కేసీపీ చక్కెర కర్మాగార పరిధిలో చెరకు సరఫరా చేసే రైతులకు టన్నుకు రూ.3,125 చెల్లించేందుకు నిర్ణయించినట్టు యాజమాన్యం శుక్రవారం ప్రకటించింది. ప్రభుత్వ మద్దతు ధర టన్నుకు రూ.2709.50, ప్రోత్సాహక ధర రూ.115.50 కలిపి రూ.2,825 కాగా, దీనికి రూ.300 సబ్సిడీ కలిపి రూ.3,125 చెల్లించనున్నామని తెలియజేసింది. రానున్న సీజన్‌లో మొక్కతోటకు ఎకరాకు రూ.20వేలు, పిలకతోటకు రూ.8వేలు సబ్సిడీగా ఇవ్వనున్నామని, దీంతోపాటు వ్యవసాయ ఖర్చుల నిమిత్తం ఎకరాకు రూ.10వేల స్వల్ప వడ్డీతో అడ్వాన్స్‌, అవసరమైన ఎరువులు స్వల్ప వడ్డీతో రుణంగా ఇచ్చేలా నిర్ణయించామని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకుని ఎక్కువ విస్తీర్ణంలో చెరకు సాగు చేయాలని పేర్కొంది.

Updated Date - 2020-10-31T08:30:16+05:30 IST