వైసీపీ అరాచకాలను ఎండగడతాం

ABN , First Publish Date - 2020-10-27T10:05:13+05:30 IST

వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, అరాచకా లను ప్రజల్లో ఎండగడతామని మాజీ మంత్రి, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ అన్నారు.

వైసీపీ అరాచకాలను  ఎండగడతాం

మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 26 : వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, అరాచకా లను ప్రజల్లో ఎండగడతామని మాజీ మంత్రి, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ అన్నారు. సోమవారం మచిలీపట్నంలో మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు నియోజక వర్గాలకు తనను, కొనకళ్లను నియమించిన తరువాత ప్రజల్లో నూతనోత్సాహం కనబడుతోంద న్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీకి అఖండ మెజా రిటీ తీసుకొస్తామన్న విశ్వాసం తమకు ఉంద న్నారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు పతన మయ్యాయన్నారు. చంద్రబాబు హయాంలో నిర్మిం చిన ప్రాజెక్టులను వైసీపీ నేతలు ప్రారంభిస్తున్నార న్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధ ులు రాబట్టడంలో విఫలమయ్యారన్నారు.


ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పట్ల యావగింపు కనబడుతోం దన్నారు. మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారా యణరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. గత టీడీపీ హ యాంలో నిర్మించిన రోడ్లు తప్పితే వైసీపీ హయాం లో రోడ్లు నిర్మించిన పాపాన పోలేదన్నారు. 20 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం నుంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని జగన్‌ 17 నెలలైనా ప్రత్యేక హోదాపై మాట్లాడటం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే తాతయ్య, టీడీపీ నేతలు కొనకళ్ల బుల్లయ్య, కుర్రా నరేంద్ర, రామకృష్ణ పాల్గొన్నారు.


ఎస్పీకి నెట్టెం ఫిర్యాదు

వైసీపీ నేతల మాటలు విని టీడీపీ నేతలపై కింది స్థాయి పోలీసు అధికారులు అక్రమంగా కేసు లు బనాయిస్తున్నారని ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌ బాబుకు మాజీ మంత్రి, విజయవాడ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ ఫిర్యాదు చేశా రు. వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన వ్యాపారవేత్త బొల్లా శివరామకృష్ణపై అక్ర మంగా కేసులు బనాయించి, రౌడీషీట్‌ తెరుస్తా మంటూ బెదిరిస్తున్నారన్నారు. జగ్గయ్యపేట సీఐ, వత్సవాయి ఎస్‌ఐలు వైసీపీ నేతల ఒత్తిళ్లకు గురై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. వాస్తవాలు విచారించి తగిన న్యాయం చేయాలని నెట్టెం రఘురామ్‌, మాజీ ఎమ్మెల్యే తాతయ్య కోరారు.

Updated Date - 2020-10-27T10:05:13+05:30 IST