అంగన్‌ వాడీ కేంద్రాల్లో న్యూట్రీ, కిచెన్‌ గార్డెన్లు

ABN , First Publish Date - 2020-10-01T07:42:22+05:30 IST

జిల్లాలోని 1868 అంగన్‌ వాడీ కేంద్రాల్లో గాంధీ జయంతి నాటికి న్యూట్రీ, కిచెన్‌ గార్డెన్లు సిద్ధం చేస్తున్నట్టు కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. కానూరులోని స్ర్తీ, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయంలో బుధవారం పోషణ మాసోత్సవం ముగింపు సమావేశంలో పాల్గొన్నారు.

అంగన్‌ వాడీ కేంద్రాల్లో న్యూట్రీ, కిచెన్‌ గార్డెన్లు

పెనమలూరు, సెప్టెంబరు 30 : జిల్లాలోని 1868 అంగన్‌ వాడీ కేంద్రాల్లో గాంధీ జయంతి నాటికి న్యూట్రీ, కిచెన్‌ గార్డెన్లు సిద్ధం చేస్తున్నట్టు కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. కానూరులోని స్ర్తీ, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయంలో బుధవారం పోషణ మాసోత్సవం ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 3812 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 2,16,903 మందికి రూ.70 కోట్లతో వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ మాట్లాడుతూ పౌష్టికాహారంపై క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందన్నారు.


ఇటీవల నిర్వహించిన వెల్‌ బేబీ షోలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన రాహుల్‌, గౌషియాలకు కలెక్టర్‌ బహుమతు లను ప్రదానం చేశారు ఐసీడీఎస్‌ పీడీ కె.ఉమారాణి, మెప్మా పీడీ ప్రకాశరావు, ఏిపీడీ సునీత, ఎంపీడీవో విమాదేవి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T07:42:22+05:30 IST