Abn logo
Sep 29 2020 @ 04:50AM

కాల్వలో పడి ఇద్దరి మృతి

Kaakateeya

వత్సవాయి, సెప్టెంబరు 28: ప్రమాదవశాత్తు ఎన్‌ఎస్పీ కాల్వలో పడి ఇద్దరు మృతి చెందిన సంఘ టన సోమవారం వత్సవాయిలో జరిగింది. వీరముచ్చు కాలనీకి చెం దిన మహంకాళి నారాయణ (45), అన్న కుమారుడు 9వ తరగతి చదువుతున్న శివకుమార్‌ (15) కలిసి వేములనర్వ గ్రామ సమీపంలోని ఎన్‌ఎస్పీ కాల్వలో చేపలు పట్టేం దుకు వెళ్లారు. గాలంతో చేపలు పడుతుండగా నారాయణ ప్రమాదవ శాత్తు కాలు జారి కాల్వలో పడ్డాడు. శివకుమార్‌ రక్షించేందుకు కాల్వలో దూకాడు.


కాల్వ ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో ఇద్దరూ గల్లంత య్యారు. గజఈతగాళ్లు కాల్వలో గాలించి మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు నారాయణకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 

Advertisement
Advertisement
Advertisement