Abn logo
Sep 28 2020 @ 05:30AM

రామానుజయ సేవలు అజరామరం

మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 27 : కాపు విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు కాపు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దివంగత చలమలశెట్టి రామానుజయ చేసిన సేవలు మరువలేమని మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ గోపు సత్యనారాయణ అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ఆదివారం రామానుజయ సంతాప సభ జరిగింది.


ఈ సభలో గోపు సత్యనారాయణ, మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ పంచపర్వాల కాశీవిశ్వనాథం, మాజీ కౌన్సిలర్‌ కొట్టె వెంకట్రావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పీవీ ఫణికుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇలియాస్‌ పాషా, టీడీ పీ రూరల్‌ మండల పార్టీ అధ్యక్షుడు కుంచే నాని, లంకే హరికృష్ణ తదితరులు రామానుజయ సేవలపై ప్రసంగించారు. 

Advertisement
Advertisement