విజయవాడ: శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఇందిరాగాంధీ స్టేడియంలో పర్యాటక, క్రీడా శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దారెడ్డి గైర్హాజరయ్యారు. సభలో నాయకులు, అధికారులు బైరెడ్డి పేరే ఎత్తలేదు. అయితే ప్రోటోకాల్ ప్రకారం అయన పేరును కూడా తీయలేదు. కాగా ఇప్పటికే బైరెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే నాయకులు, అధికారులు బైరెడ్డి పేరు ఎత్తలేదని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి