ద్వా సుపర్ణా...

ABN , First Publish Date - 2020-08-17T05:57:26+05:30 IST

‘‘రెండు పక్షులు, ఒక జాతివి, కలవంద మైన రెక్కలవి, కలిసి వాసముంటు యున్నవి, ప్రేమ బంధముతొ జత కట్టి వేయబడి...

ద్వా సుపర్ణా...

తే.గీ. ‘‘రెండు పక్షులు, ఒక జాతివి, కలవంద

మైన రెక్కలవి, కలిసి వాసముంటు

యున్నవి, ప్రేమ బంధముతొ జత కట్టి

వేయబడి, యెన్నొనాళ్ళొకచెట్టుపైన!


తే.గీ. వాటి యందొక పక్షి నవనవలాడు

చున్న ఆ చెట్టు పండును కొరికి తినుచు

యున్నదీ; రెండవది తిను కోర్కె విడచి

యె, తన జతదైన పక్షిని వీక్షణముల


తే.గీ. పరిపరి పరికించుచు పరమాత్మమోద

మందుచు తనయందుతనె తాదాత్మ్యమున ము

నిగి కదలకయున్నది!’’ - బహు హృద్యప్రేమ

భావ మిది; ఋక్కులందున నిలిచి ఉంది!


(ఆధునిక భావకవిత్వ ధోరణిలోని భావానికి ఏమాత్రం తీసిపోక, అందుకు తొలి బలమైన ఛాయలు కలిగియుండి, ‘ద్వా సుపర్ణా...’ ఋక్కుగా బహుళ ప్రసిద్ధి పొందిన, ఋగ్వేదం, ప్రథమ మండలం, 164వ సూక్తం లోని 20వ ఋక్కులో, ఆ ఋక్కుకు కర్తయైున ఋషి దీర్ఘతమా ఔచథ్యుడు వ్యక్తం చేసిన భావానికి తెలుగు ‘తేటగీతి’.)

భట్టు వెంకటరావు


Updated Date - 2020-08-17T05:57:26+05:30 IST