ఫోన్‌ చేస్తే.. ఇంటి వద్దకే సరుకులు

ABN , First Publish Date - 2020-03-27T10:46:20+05:30 IST

కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే నిత్యావసర సరుకులను ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం

ఫోన్‌ చేస్తే.. ఇంటి వద్దకే సరుకులు

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, మార్చి 26) : కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే నిత్యావసర సరుకులను ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే విక్రయించాలని ఆదేశించిన విషయం  తెలిసిందే. ఇక నుంచి, ఫోన్‌చేస్తే నేరుగా కొనుగోలుదారుల ఇళ్లకే సరుకులు సరఫరా  చేసేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని సూపర్‌ బజార్ల యాజమాన్యాలు వినియోగదారులు ఫోన్‌చేస్తే నేరుగా ఇళ్ల వద్దకే సరుకులను సరఫరా చేసేందుకు అంగీకారం తెలిపాయి.


రూ.500 పైగా సరుకులను కొనుగోలుచేస్తే ఎటువంటి రుసుం లేకుండా చేరవేస్తారు. రూ.500 లోపైతే.. రూ.25 రుసుం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం కొనుగోలుదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని జేసీ శ్రీనివాసులు తెలిపారు. నిత్యావసర సరుకులు, ధరలను కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. 


సూపర్‌బజార్ల ఫోన్‌ నంబర్లు.. 

నిత్యావసర సరుకులు కావాల్సినవారు ఈ దిగువ సూపర్‌బజార్ల నంబర్లకు ఫోన్‌చేయాలని జేసీ శ్రీనివాసులు తెలిపారు. సృష్టిహైపర్‌ స్టోర్స్‌ ఫోన్‌: 91336 90999, 91335 80888, 

మిత్రా సూపర్‌ మార్కెట్‌ : 8688 819999, 98209 31898, 

శివానంద సూపర్‌మార్కెట్‌: 98855 55445, 

పట్టపగలు కామరాజు సన్స్‌ అండ్‌ కిరాణా: 99895 61733, 95533 88585, చంద్రమూళి డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌ (డేఅండ్‌నైట్‌): 98481051109, 

చంద్రమౌళి బ్రదర్స్‌ (ఏడురోడ్ల జంక్షన్‌): 9494610894, 9848105108 నంబర్లను సంప్రదించాలని సూచించారు.  

Updated Date - 2020-03-27T10:46:20+05:30 IST