జూలై 31లోగా ‘నాడు-నేడు’ పనులు పూర్తి

ABN , First Publish Date - 2020-05-27T09:44:17+05:30 IST

నాడు-నేడు’ పథకంలో చేపడుతున్న పను లు జూలై 31వ తేదీ లోగా పూర్తి చేయాలని జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ ..

జూలై 31లోగా ‘నాడు-నేడు’ పనులు పూర్తి

పలాస రూరల్‌, మే 26: ‘నాడు-నేడు’ పథకంలో చేపడుతున్న పను లు జూలై 31వ తేదీ లోగా పూర్తి చేయాలని జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎస్‌.తిరుమల చైతన్య ఆదేశించారు. మంగళవారం పలాస ఎంఆర్‌సీ భవ నంలో పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల పరి ధిలోని పాఠశా లల పనులపై సీఆర్పీలు, సర్వశిక్షా అభియాన్‌ సెక్టోరియల్‌ బృందంతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొదటి దశలో 1,239 పాఠశా లల్లో తొమ్మిది అంశాల్లో జరుగుతున్న పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎస్‌ఎస్‌ఏ సెక్టోరియల్‌ సభ్యులు గుంట లక్ష్మణరావు, సీహెచ్‌ సుధాకర్‌, ఎ.రామకృష్ణ, ఎంఈవో సీహెచ్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 


పనులను పర్యవేక్షించండి

 నరసన్నపేట: ‘నాడు-నేడు’ పథకంలో పాఠశాలలో చేపడుతున్న పనులను సకాలంలో పూర్తిచేయాలని సమగ్ర శిక్షా అభియాన్‌ ఏపీసీ పి.వెంకటరావు కోరారు. మంగళవారం దేశ వానిపేట, జమ్ము పాఠశాలల్లో చేపడుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో ఉప్పాడ శాంతారావు, ఏఎంవో సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. 


 పాఠశాలల ప్రారంభం నాటికి సిద్ధం..

సంతబొమ్మాళి: మండలంలో ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా చేపడు తున్న అభివృద్ధి పనులు పాఠశాలల పునః ప్రారంభం నాటికి పూర్తి చేయా లని ఎంఈవో జలుమూరు చిన్నవాడు అన్నారు. మంగళవారం బృందా వనం పాఠశాల పనులను పరిశీలించారు. ఆయన వెంట సీఆర్‌పీ గిరి, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ కుమారి పాల్గొన్నారు.

Updated Date - 2020-05-27T09:44:17+05:30 IST