3 లోక్‌సభ, 29 అసెంబ్లీ సెగ్మెంట్ల ఉప ఎన్నికల అప్ డేట్స్

ABN , First Publish Date - 2021-11-02T14:51:20+05:30 IST

దేశంలో అక్టోబరు 30న జరిగిన మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది.

3 లోక్‌సభ, 29 అసెంబ్లీ సెగ్మెంట్ల ఉప ఎన్నికల అప్ డేట్స్


అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫలితాలు

రాష్ట్రంస్థానంగెలిచిన పార్టీఅభ్యర్థి
ఆంధ్రప్రదేశ్బద్వేల్వైయస్‌ఆర్‌సీపీదాసరి సుధ
అస్సాంగోస్సైగాన్ యూపీపీఎల్
జిరోన్ బాసుమతరి
అస్సాంభవానీపూర్బీజేపీఫణిందర్ తాలూక్‌దార్
అస్సాంమరియానిబీజేపీరూప్‌జ్యోతి కుర్మి
అస్సాంతాముల్‌పూర్యూపీపీఎల్జోలెన్ డైమారి
అస్సాంతోర్వాబీజేపీసుశాంత బోర్గోహైన్
బిహార్తారాపూర్జేడీయూరాజీవ్ కుమార్ సింగ్
బిహార్
కుషేశ్వర్ ఆస్థాన్జేడీయూఅమన్ బూషన్ హజారీ
హర్యానాఎల్లెనబాద్ఐఎన్ఎల్‌డీఅభయ్ సింగ్ చౌతాలా
హిమాచల్ ప్రదేశ్అర్కికాంగ్రెస్సంజయ్
హిమాచల్ ప్రదేశ్ఫతేపూర్కాంగ్రెస్భవానీసింగ్ పటానియా
హిమాచల్ ప్రదేశ్జుబల్-కొతాయికాంగ్రెస్రోహిత్ ఠాకూర్
కర్ణాటకహంగల్కాంగ్రెస్శివరాజ్ శరనప్ప సజ్జనార్
కర్ణాటకసింద్గిబీజేపీబూసనూర్ రమేష్ బలప్ప
మధ్యప్రదేశ్జొబట్బీజేపీసులోచనా రావత్
మధ్యప్రదేశ్పృథ్వీపూర్బీజేపీడాక్టర్ శిశుపాల్ యాదవ్
మధ్యప్రదేశ్రాయగన్కాంగ్రెస్ కల్పన వర్మ
మహారాష్ట్రడెగ్లూర్కాంగ్రెస్అంతపుర్కర్ జితేష్ రావుసాహేబ్
మేఘాలయమావ్‌ప్లంగ్యూడీపీయూగున్‌సన్ లింగ్డో
మేఘాలయమారింగ్‌కెంగ్ఎన్‌పీపీపైనియద్ సింగ్ సైమ్
మేఘాలయరాజబాలఎన్‌పీపీఎండీ అబ్దుస్ సాలే
మిజోరాంతూరియాల్ఎంఎన్ఎఫ్కె.లాల్‌దాంగ్లియానా
నాగాలాండ్షమతర్ చెస్సోర్ఎన్‌డీపీపీకోషు హిమ్‌చుంగర్
రాజస్తాన్దరియావాద్కాంగ్రెస్నాగ్‌రాజ్
రాజస్తాన్వల్లభ్ నగర్కాంగ్రెస్ప్రీతి గజేంద్ర సింగ్ షేకావత్
తెలంగాణహుజూరాబాద్బీజేపీఈటల రాజేందర్
పశ్చిమ బెంగాల్దింహాతాటీఎంసీఉదయాన్ గుహ
పశ్చిమ బెంగాల్
గోసాబాటీఎంసీసుబ్రతో మండల్
పశ్చిమ బెంగాల్
ఖార్దాహాటీఎంసీసోభానందేబ్ సహాపాధ్యాయ్
పశ్చిమ బెంగాల్
శాంతిపూర్టీఎంసీబ్రజా కిశోర్ గోస్వామి


లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఫలితాలు


రాష్ట్రంస్థానంగెలిచిన పార్టీఅభ్యర్థి
దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ
దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ
శివసేనదేల్‌కర్ కాలాబెన్ మోహన్‌బాయి
హిమాచల్ ప్రదేశ్మండికాంగ్రెస్ప్రతిభా సింగ్
మధ్యప్రదేశ్ ఖాండ్వాబీజేపీజ్ణానేశ్వర్ పాటిల్




హర్యానాలో ఆధిక్యంలో ఐఎన్ఎల్‌డీ చీఫ్ అభయ్ చౌతాలా 

చండీఘడ్ : హర్యానాలోని ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం ఎల్లనబాద్‌కి జరిగిన ఉప ఎన్నికలో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అధినేత అభయ్ చౌతాలా విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోవింగ్ కాండపై 6,000 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో హర్యానాలోని ఎల్లెనాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ప్రత్యేకమైనది. ఈ ప్రత్యేకత ఏంటంటే.. ఈ స్థానానికి ఉప ఎన్నికల జరగడానికి కారణం మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న రైతుల ఆందోళన. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అభయ్ సింగ్ చౌతాలా, రైతుల ఆందోళనకు మద్దతుగా రాజీనామా చేశారు. దేశంలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతోన్న రైతుల ఆందోళన వల్ల ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం విశేషమే అని అంటున్నారు.


బెంగాల్‌లో టీఎంసీ అభ్యర్థుల గెలుపు

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దింహాతా నుంచి ఉదయాన్ గుహ, గోసాబా నుంచి సుబ్రతో మండల్, ఖార్దాహా నుంచి సోభానందేబ్ సహోపాధ్యాయ్, శాంతిపూర్ నుంచి బ్రజా కిశోర్ గోస్వామి గెలుపొందారు. కాగా, ఫలితాలు రావడానికి ముందే టీఎంసీ అధినేత మమతా బెనర్జీ నాలుగు స్థానాల్లో తమదే విజయం అని ప్రకటించడం గమనార్హం.


అసోంలో ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థులు

న్యూఢిల్లీ : అసోం రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగ్గా, అధికార బీజేపీ మూడు స్థానాలు కైవసం చేసుకుంది. ఇక యూనైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ పార్టీ రెండు స్థానాలు గెలుచుకుంది. భవానీపూర్ నుంచి ఫిందర్ తాలూక్‌దార్, మరియాని నుంచి రూప్‌జ్యోతి, తోర్వా నుంచి సుశాంత బోర్గోహైన్ గెలుపొందారు. వీరంతా బీజేపీ అభ్యర్థులు. ఇక యూనైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ నుంచి ఇద్దరు గెలుపొందారు. గోస్సెగాన్ నుంచి జిరోన్‌ బాసుమతరి తాముల్‌పూర్ నుంచి జోలెన్ డైమారి విజయం సాధించారు.


బీహార్‌లో రెండు స్థానాలూ జేడీయూవే

పాట్నా : బీహార్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ జేడీయూ జోరు చూపించింది. రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీనే విజయం సాధించింది. ప్రతిపక్ష ఆర్‌జేడీ మొదట్లో తారాపూర్ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ చివరి ఫలితం వెలువడే నాటికి జేడీయూ ఆధిక్యంలోకి వచ్చి విజయం సాధించింది. కుషేశ్వర్ ఆస్థాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి గణేష్ భారతీపై జేడీయూ అభ్యర్థి అమన్ భూషణ్ హజారి విజయం సాధించారు. ఇక తారాపూర్ నియోజకవర్గంలో జేడీయూ నేత రాజీవ్ కుమార్ సింగ్ గెలుపొందారు.


ఖండ్వాలో బీజేపీ, మండీలో కాంగ్రెస్

ఖండ్వా : మధ్యప్రదేశ్‌ని ఖాండ్వా లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌నారాయణ్ సింగ్ పూర్ణిపై బీజేపీ అభ్యర్థి జ్ణానేశ్వర్ పాటిల్ ఈ విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ గెలుపొందింది. బీజేపీ అభ్యర్థి కుశాల్ చంద్ ఠాకూర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభా సింగ్ విజయం సాధించారు.


దాద్రా అండ్ నగర్ హవేలీ లోక్‌సభ నియోజకవర్గంలో శివసేన విజయం 

ముంబై : దాద్రా అండ్ నగర్ హవేలీ లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో శివసేన కాలాబెన్ దేల్కర్ విజయం సాధించారు. మాజీ ఎంపీ మోహన్ దేల్కర్ ఆత్మహత్య చేసుకోవడంతో జరిగిన ఉప ఎన్నికల్లో అతని భార్య కాలాబెన్ దేల్కర్‌ను శివసేన అభ్యర్థిగా బరిలోకి దించింది.


మధ్యప్రదేశ్‌లో ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థులు

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ స్థానాలకు గాను అధికార భారతీయ జనతా పార్టీ రెండు గెలుచుకుంది. జోబట్ నుంచి సులోచనా రావత్, పృథ్వాపూర్ నుంచి డాక్టర్ శిశుపాల్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థులపై విజయం సాధించారు. కాగా, రాయగన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి కల్పన వర్మ విజయం సాధించారు. కొంత కాలం క్రితం ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. అయితే ఈ ఉప ఎన్నికలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.

Updated Date - 2021-11-02T14:51:20+05:30 IST