ప్రారంభమైన ఆత్మకూర్ ఉపఎన్నిక పోలింగ్

ABN , First Publish Date - 2022-06-23T12:45:50+05:30 IST

ఆత్మకూరులో ఉపఎన్నికకు పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ ప్రక్రియ

ప్రారంభమైన ఆత్మకూర్ ఉపఎన్నిక పోలింగ్

నెల్లూరు: ఆత్మకూరులో ఉపఎన్నికకు పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ ప్రక్రియ పర్యవేక్షణ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా జరగనుంది. ఈ నెల 26న ఫలితాలు వెలువడుతాయి.

మాజీ మంత్రి గౌతంరెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు స్థానానికి ఉపఎన్నిక జరుగుతుంది. ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో 14 మంది అభ్యర్ధులు ఉన్నారు.  వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసు, మరో 11 మంది పోటీలో ఉన్నారు. 


ఆత్మకూరు ఉప ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆత్మకూరు మండలంలో 52,155 మంది, అనంతసాగరంలో 35,002 మంది, చేజర్లలో 27,894 మంది, మర్రిపాడులో 34,859 మంది, ఏఎ్‌సపేటలో 28,026 మంది, సంగంలో 35,402 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకుగాను 279 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు తదితర సామగ్రిని తీసుకుని ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు, ఇతర సిబ్బంది బుధవారం సాయంత్రానికల్లా నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో పోలింగ్‌ సామగ్రిని తరలించారు. ఎన్నికల్లో ఎలాంటి సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. 

Updated Date - 2022-06-23T12:45:50+05:30 IST