‘బీజేపీయేతర పార్టీలను ఒకే వేదికపైకి తెస్తే...’

ABN , First Publish Date - 2021-12-27T23:09:21+05:30 IST

జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత అనేదే మంచి నినాదం కాదని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిస్తే ఐక్యత కంటే విభజన ఎక్కువగా జరుగుతుందన్నారు.

‘బీజేపీయేతర పార్టీలను ఒకే వేదికపైకి తెస్తే...’

అమరావతి: జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత అనేదే మంచి నినాదం కాదని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిస్తే ఐక్యత కంటే విభజన ఎక్కువగా జరుగుతుందన్నారు. అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, వాటి మధ్య పోటీ ఉందన్నారు. రాజకీయంగా జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను ఒకే వేదికపైకి తెస్తే తగాదాలు మరింత పెరుగుతాయని ఆయన సూచించారు. రాజకీయంగా బీజేపీయేతర పార్టీలను తెచ్చే ప్రయత్నం చేయడం వృధా ప్రయాసేనన్నారు.  

Updated Date - 2021-12-27T23:09:21+05:30 IST