ఓట్ల అంగడి!

ABN , First Publish Date - 2022-08-20T09:49:44+05:30 IST

మునుగోడులో పైసల జల్లు కురుస్తోంది. ఖర్చు ఎంతైనా ఓటరు మహాశయుడిని ప్రసన్నం చేసుకుంటే చాలు అన్నట్లుగా పార్టీలు క్షేత్రస్థాయిలో బలగాలను మోహరించాయి.

ఓట్ల అంగడి!

మునుగోడులో కట్టలు తెగుతున్న డబ్బు

కండువా కప్పేందుకు చోటామోటా లీడర్లకు ఆఫర్‌ 

టీఆర్‌ఎస్‌ ధర రూ.10లక్షలు.. బీజేపీ దీనికి రెండింతలు

గత 12 రోజుల్లో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన 11 మంది సర్పంచ్‌లు, ఏడుగురు ఎంపీటీసీలు

సభకు జనం కోసం తలా రూ.500, క్వార్టర్‌ మందు

మునుగోడులో టీఆర్‌ఎస్‌కే సీపీఐ మద్దతు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చాడ, కూనంనేని, పల్లా భేటీ

కలిసి పనిచేద్దామన్న కేసీఆర్‌ ప్రతిపాదనకు ఓకే


నల్లగొండ, హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మునుగోడులో పైసల జల్లు కురుస్తోంది. ఖర్చు ఎంతైనా ఓటరు మహాశయుడిని ప్రసన్నం చేసుకుంటే చాలు అన్నట్లుగా పార్టీలు క్షేత్రస్థాయిలో బలగాలను మోహరించాయి. స్థానికంగా ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి తీసుకునేందుకు కొనుగోళ్ల ప్రక్రియనూ మరోస్థాయికి తీసుకెళ్లాయి. పైగా సభలు, సమావేశాల ఏర్పాట్లు.. అక్కడికి జనం తరలింపు.. ఇలా ప్రతి పనికి వెలకట్టి మరీ చెల్లింపులు జరిగితేనే పనులు సాగుతున్నాయి.


మొత్తంగా ఉప ఎన్నికకక కోసం ఇంకా నోటిఫికేషనే వెలువడలేదు.. మునుగోడులో ఎన్నికల సందడి వచ్చేసింది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి నుంచి పోటీ మాట అటుంచితే సొంత పార్టీలో అసమ్మతి పొగ గుప్పుమంటే అది మొదటికే మోసం వస్తుందనే ఉద్దేశంతో ఆ వ్యవహారాన్ని చక్కబెట్టే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. టికెట్‌ ఆశావహులు పక్కకు తప్పుకొనేందుకు బరిలో ఉండాలనుకునే నేత రూ.50 లక్షల నుంచి రూ.కోటి దాకా ముట్టజెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. అలాగే నియోజకవర్గంలో బడా ప్రజాప్రతినిధులకు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా ధర పలుకుతోంది. ప్రజాప్రతినిధుల కొనుగోళ్లకు సంబంధించి మొదటి దశ పూర్తి కాగా స్వల్ప ఓట్ల తో ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థులు, నియోజకవర్గంలోని యువజన సంఘాల నేతలు, ఇతర పార్టీల ఇన్‌చార్జీలకు ధర నిర్ణయించి చకచకా కండువాలు కప్పేస్తున్నారు. 


రేసులో టీఆర్‌ఎస్‌ దూకుడు

‘మునుగోడులో పార్టీ పరిస్థితి బాగుందని అంతా చె బుతున్నారు, మరి ఇతర పార్టీల నుంచి చేరికలు ఎం దుకు లేవు? ఆ పని వేగిరం చేయండి’ అంటూ స్వయంగా సీఎం కేసీఆర్‌, పార్టీ కీలక నేతలతో స్పష్టం చేసినట్లు సమాచారం. అధినేత ఆదేశంతో కొనుగోళ్ల వ్యవహారంలో ఆ పార్టీ నేతలు వేగం పెంచారు. గత 12 రోజుల్లో కాంగ్రె్‌సకు చెందిన 11 మంది సర్పంచ్‌లు, ఏడుగురు ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొన్నా రు. ఒక్కో ప్రజాప్రతినిధికి రూ.10లక్షలు, ఎస్సీ సర్పంచ్‌లకైతే ఈ రూ.10లక్షలతో పాటు రెండు దళితబంధు యూనిట్లనుఅందించేందుకు కీలక నేతల నుంచి హామీ లభించింది. అధికార టీఆర్‌ఎ్‌సను పోటీలో నిలువరించేందుకు బీజేపీ కూడా ప్రజాప్రతినిధుల కొనుగోళ్లకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. టీఆర్‌ఎ్‌సలో అసంతృప్తితో ఉన్న 10మంది ప్రజాప్రతినిధులను గుర్తించి ఒక్కొక్కరి కి రూ.20లక్షలు ఇచ్చేందుకు, కాషాయం కండువా క ప్పుకున్న మరుక్షణమే ముందస్తుగా రూ.10లక్షలు అం దజేతకు ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు. ఎదుటి పార్టీ నుంచి నేతల కొనుగోళ్లకే ఆసక్తి చూపుతుండడం తో సొంత పార్టీ ప్రజాప్రతినిధులు తమ సంగతి ఏం టంటూ డిమాండ్లు ప్రారంభించారు. దీంతో అధికార పార్టీకి చెందిన బడా నేతలు  ఒక్కొక్కరికి రూ.2లక్షలు అడ్వాన్స్‌గా అందజేశారు. 


ఫంక్షన్‌ హాళ్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ 

మునుగోడు  నియోజకవర్గంలో ఇప్పుడు ఏ గ్రామం లో చూసినా ఖరీదైన కార్లలో బడానేతల రాకపోకలు కనిపిస్తున్నాయి.  ప్రతి మండల కేంద్రంలో నిత్యం ఏదో ఒక పార్టీ సమావేశం జరుగుతోంది. ప్రజా సం ఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. సీఎం కేసీఆర్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభలు వరుసగా ఉండ టం, సీఎం సభ రోజే కాంగ్రెస్‌ దిగ్గజాలు నియోజకవర్గంలోని గ్రామగ్రామన పర్యటించేందుకు షెడ్యూల్‌ ఖ రారు  చేసుకోవడంతో మూడు పార్టీల జెండాలు, ఫ్లెక్సీలతో వీధులన్నీ కళకళాడుతున్నాయి. మద్యం ఏరులై పారుతుండటంతో వాటి అమ్మకాలు పెరిగాయి. వాహనాలు తిరుగుతుండటంతో ఇంధన అమ్మకాలూ పెరిగా యి. క్షేత్రస్థాయిలో నేతల మోహరింపుతో ఇంటి అద్దెల రేట్లూ పెరిగాయి. జూలైలో వైన్‌షా్‌పలలో రోజుకు రూ. 2.5లక్షల చొప్పున మద్యం అమ్మకాలు జరిగితే పదిరోజుల్లో ఇది రూ.3 లక్షలకు పెరిగింది. బార్లలో మునుపు రూ.లక్ష చొప్పున వ్యాపారం జరిగితే అది రెండింతలైం ది. ఇళ్లు, దుకాణాల అద్దెలు రెట్టింపయ్యాయి. సీఎం కేసీఆర్‌, అమిత్‌షా సభలకు  వచ్చే వారకి  రూ.500, క్వార్టర్‌ మందు.. మహిళలకు ఫుల్‌బాటిల్‌ కూల్‌డ్రింక్‌, పలుకుబడి కలిగిన వ్యక్తులకు బీరు, బిర్యానీ, ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్‌, 21న అమిత్‌షా సభ నేపథ్యంలో జనాన్ని సభలకు తరలించేందుకు స్థానికంగా ఉన్న డీసీఎంలు, తుఫాన్‌ వాహనాలు సరిపోయే పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్‌ సభకు లక్ష మందిని, అమిత్‌షా సభకు 4లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చే స్తుండటంతో ఆ మేరకు వాహనాలు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్‌ నుంచి పెద్ద సంఖ్యలో డీసీఎంలను ముందస్తుగా ఆయా పార్టీల నేతలు బుక్‌ చేశారు. మునుగోడు పరిసర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి డీసీఎంలకు రూ.7వేలు అద్దె కాగా హైదరాబాద్‌ నుంచి వచ్చే ఒక్కో డీసీఎంలకు రూ.14వేలు చెల్లించాల్సిన పరిస్థితి. గత నెలలో పెట్రోల్‌ బంకుల్లో రోజుకు 1000 లీటర్ల అమ్మకాలు జరిగేవి. ఉప ఎన్నిక ప్రభావం తో గత పది రోజులుగా పార్టీల నేతల వాహనాలు పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలో సంచరిస్తుండడంతో ఈ విక్రయాలు రోజుకు 1800 లీటర్ల వరకు పెరిగాయి. 


పార్టీలోకి రావొద్దు.. మీ పార్టీ ప్రచారంలో కనిపించొద్దు 

మునుగోడు ఉప ఎన్నికలో ఎలగైనా గెలవాల నే పట్టుదలతో ఉన్న పార్టీలు, ఆ దిశగా ఏ అవకాశాన్నీ వదలుకోవడం లేదు. పార్టీలోకి రావాలని ప్రత్యర్థి పార్టీ నేతలకు ఆఫర్‌ ఇచ్చినా వారు కాద నే సరికి వినూత్న ప్రతిపాదనను ముందు పెడుతున్నారు. ‘మీరు మీ పార్టీలోకి రావొద్దు సరే..  కా నీ ఎన్నికల ప్రచారంలో మీ పార్టీ అభ్యర్ధి తరఫున ప్రచారం చేయకపోతే చాలు. మీరు కోరినంత డబ్బు ఇస్తాం. కాదంటే ఖరీదైన బహుమతులు పంపుతాం’అంటూ రాయబారాలునడిపిస్తున్నారు. ప్రధానంగా మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో ఈ ఆఫర్లు వినిపిస్తున్నా యి. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ పటిష్టంగా ఉంది.  ఇక్కడి నేతలు ఎన్నికల ప్రచారంలో కనిపించక కుండాఉండేందుకు డబ్బు, బహుమతులతో పాటు ప్రచారం ముగిసే వరకు యాత్రలకు వెళ్లడానికి అవసరమైన ఆర్ధిక సాయం అందిస్తామనే హామీలు ఇస్తున్నట్టు తెలిసింది. కుటుంబంతో వెళ్లాలనుకున్నా... లేదా మిత్రులతో కలిసి వెళ్లాలనుకున్నా  ఏర్పాట్లు చేస్తామని అధికార పార్టీ నేత ల నుంచి ఆఫర్‌ వచ్చినట్టు తెలిసింది.  ఏళ్ల తరబడి నుంచి కాంగ్రె స్‌ పార్టీలో పని చేసినా గుర్తింపునకునోచుకోని కొంత మంది నాయకులు అధికా ర పార్టీల రహస్య ఒప్పందాలకు సంసిద్ధత వ్యక్తం చే స్తున్నట్టు సమాచారం. మరికొంత మంది నాయకులు ససేమిరా అంటూ తాము నమ్మిన పా ర్టీకే విధేయతగా పని చేస్తామని ముఖం మీదనే చెబుతున్నట్టు తెలిసింది.  

Updated Date - 2022-08-20T09:49:44+05:30 IST