మొక్కజొన్న కొనుగోలు చేయండి

ABN , First Publish Date - 2020-06-05T10:11:31+05:30 IST

మొక్కజొన్న పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మొక్కజొన్న కొనుగోలు చేయండి

బిత్రపాడు (జియ్యమ్మవలస), జూన్‌ 4: మొక్కజొన్న పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  చినమే రంగి కోఆపరేటివ్‌ సొసైటీ పరిధి బిత్రపాడు సచివాలయంలో 20 మంది మొక్కజొన్న రైతులు ఈ ఏడాది 40 ఎకరాల్లో మొక్కజొన్న పండించారు. చినమేరంగి సొసైటీలో కొనుగోలు కేంద్రాన్ని శత్రుచర్ల పరీక్షిత్‌రాజు చేతుల మీదుగా మార్చిలో ప్రారంభించారు. అప్పుడే ఈ బిత్రపాడు రైతులు కొనుగోళ్లకు రిజిస్ట్రేషన్‌ కూడా చేయించారు. మొదట కొనుగోలు ఖచ్చితంగా చేస్తామని చెప్పినా సొసైటీ సిబ్బంది రెండు నెలలైనా కొనుగోలు చేయలేదు.


తీరా ఇప్పుడు కొనుగోలు కేంద్రం ఎత్తేశామని సొసైటీ కార్యదర్శి రామారావు చెప్పారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి క్వింటా రూ. 1750లకు కొనుగోలు చేయాల్సి ఉంది. తీరా ఇప్పుడు దళారులు వచ్చి క్వింటా రూ. 1350లకు ఇస్తే తీసుకుంటామని చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. ఇదే విషయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి తెలిపినా పట్టించుకోలేదని ఆ గ్రామ రైతు బోను సింహాచలం వాపోతున్నారు.



రామభద్రపురం: మండల కేంద్రంలో పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 19వేల క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు చేశారు. అయితే మే 20 నుంచి  కొనుగోలు నిలిపివేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తు తం బాడంగి, రామభద్రపురం మండలాల్లో మరో 10వేల క్వింటాళ్ల మొక్క జొన్న పంట సిద్ధంగా ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా కొనుగోలు చేసిన మొక్క జొన్న రవాణా కాకపోవడంతో ఈ అమ్మకాలు నిలుపుదల చేసినట్టు తెలిసింది.  ఈ ఏడాది  ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాకు రూ.1760 మద్దతు ధర ఇవ్వ డంతో రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తెస్తున్నారని పీఏసీఎస్‌ అధ్యక్షుడు కిర్ల చంద్రశేఖర్‌ తెలిపారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామని త్వరలోనే కొనుగోలుకు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. 


విజయనగరం: చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో మొక్కజొన్న  రైతు లను ఆదుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కిమిడి నాగార్జున కో రారు. ఈ మేరకు గురువారం ఆయన  కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ను కలిసి విన తిపత్రం అందించారు. కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ లక్ష్యం విధి ంచడంతో రైతుల వద్ద దిగుబడులను క్రయం చేయడం లేదన్నారు. ఇప్ప టికైనా పార్టీలకు అతీతంగా సహకరించాలని కలెక్టర్‌ను ఆయన కోరారు. 


 20 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలి : జేసీ

విజయనగరం (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతుల నుంచి 20 వేల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయాలని జేసీ కిషోర్‌కుమార్‌ సూచించారు. గురువారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులు, విజయనగర్‌ బయోటెక్‌ సంస్థ ప్రతినిధులతో  సమావేశం నిర్వహించారు. జిల్లాలో పండిన మొక్కజొన్నను ‘ఎవరు కొంటున్నారు, ఎంత ధరకు కొంటున్నారు’ అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ..  లాక్‌డౌన్‌కు సడలింపు ఇవ్వడంతో వ్యవసాయ ఉత్పత్తుల రవాణ, వ్యాపారాలకు ఏ విధమైన ఇబ్బందులు లేవన్నారు.   సమావేశంలో మార్కెటింగ్‌ ఏడీ శ్యాంకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-05T10:11:31+05:30 IST