Abn logo
Feb 21 2020 @ 22:39PM

‘బుట్టబొమ్మ’పై ఈ వార్తలేంటి?

ప్రస్తుతం పూజా హెగ్డే పేరు టాలీవుడ్‌లో మారుమోగిపోతోంది. వరుస హిట్లతో దూసుకుపోతోంది. ఒక్క టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా పూజా హవా నడుస్తోంది. అక్కడ రెండు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో కూడా రెండు సినిమాలు చేస్తోంది. అంత బిజీ షెడ్యూల్‌లోనూ పూజా ప్రేమలో పడిందన్న వార్తలు షికారు చేస్తున్నాయి. పూజా ప్రేమలో పడింది బాలీవుడ్‌లోని ఓ స్టార్‌ హీరో తనయుడితోనట.


గత సంవత్సరం వచ్చిన బాలీవుడ్ మూవీ ‘బజార్‌’ చిత్రంతో పాపులరైన సీనియర్ స్టార్ వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ వినోద్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో పడిందని అంటున్నాయి సినీ వర్గాలు. వీరిద్దరూ సమయం దొరికినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారట. కాకపోతే ఈ విషయంలో ఆ ఇద్దరూ పెదవి విప్పడం లేదట. నిప్పు లేనిదే పొగరాదని అంటుంటారు. అలాగే పూజా విషయంలో కూడా ఏదో జరుగుతుందనే అనుమానాలు మాత్రం బాలీవుడ్‌లో బాగానే వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement