వేలానికి బట్లర్‌ టీషర్ట్‌!

ABN , First Publish Date - 2020-04-02T10:02:54+05:30 IST

కరోనా బాధితులకు సహాయం చేసేందుకు ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ వన్డే ప్రపంచకప్‌ (2019) ఫైనల్లో ధరించిన టీషర్ట్‌ను వేలం వేయాలని నిర్ణయించాడు. వేలంలో

వేలానికి బట్లర్‌ టీషర్ట్‌!

లండన్‌: కరోనా బాధితులకు సహాయం చేసేందుకు ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ వన్డే ప్రపంచకప్‌ (2019) ఫైనల్లో ధరించిన టీషర్ట్‌ను వేలం వేయాలని నిర్ణయించాడు. వేలంలో వచ్చిన మొత్తాన్ని లండన్‌లోని రాయల్‌ బ్రాంప్టన్‌ అండ్‌ హేర్‌ఫీల్డ్‌ ఆస్పత్రికి విరాళంగా ఇవ్వనున్నాడు. వేలం వేసే టీషర్ట్‌పై వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆడిన ఇంగ్లండ్‌ క్రికెటర్లందరి సంతకాలు ఉన్నాయి. ఈ విషయాన్ని బట్లర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసి కోహ్లీ, రోహిత్‌, స్మిత్‌, మోర్గాన్‌ను ట్యాగ్‌ చేశాడు.

Updated Date - 2020-04-02T10:02:54+05:30 IST