ముమ్మరంగా ‘మహానాడు’ పనులు..!

ABN , First Publish Date - 2022-05-22T05:24:07+05:30 IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకుని రెండు రోజుల పాటు పండుగ వాతావరణంలో నిర్వహించనున్న మహానాడు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెం గ్రామపరిధిలో జరిగే కార్యక్రమానికి వేదిక నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.

ముమ్మరంగా ‘మహానాడు’ పనులు..!
మాహానాడు ఏర్పాట్ల మ్యాప్‌ను పరిశీలిస్తున్న తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత

నిరంతరం పర్యవేక్షిస్తున్న జిల్లా నేతలు

తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత పరిశీలన

ఒంగోలు (కార్పొరేషన్‌), మే 21: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకుని రెండు రోజుల పాటు పండుగ వాతావరణంలో నిర్వహించనున్న మహానాడు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెం గ్రామపరిధిలో జరిగే కార్యక్రమానికి వేదిక నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. అందుకు సంబంధించి రాష్ట్రస్థాయి ముఖ్య నేతలు, జిల్లా నేతలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శనివారం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత వచ్చి వేదిక పనులను పరిశీలించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షులు నూకసాని బాలాజీ, దర్శి ఇన్‌చార్జి పమిడి రమేష్‌తోపాటు, తెలుగు మహిళలు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో మహానాడు నిర్వహించుకోవడం శుభపరిణామం అన్నారు. గత రెండేళ్లుగా కొవిడ్‌ కారణంగా పండుగ నిర్వహించుకోలేక పోయామని, అయితే స్వర్గీయ ఎన్టీఆర్‌ శత జయంతి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


Updated Date - 2022-05-22T05:24:07+05:30 IST