Abn logo
Apr 19 2021 @ 00:06AM

మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు

లక్ష్మిపూర్‌ చెక్‌పోస్టు వద్ద మహారాష్ట్ర ప్రయాణికులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తున్న దృశ్యం

తలమడుగు, ఏప్రిల్‌ 18: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టేం దుకు అధికారులు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా మండలంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు అధికారులు ప్రతీ గ్రామంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. మాస్కు లేకుండా బయటకు వెళ్తున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఇప్పటి వరకు మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో దాదాపు 2వేల మందికి పైగా కరోనా టీకాలను వేయించామని మండల వైద్యాధికారి రాహుల్‌ తెలిపారు. మండలంలో వందకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులున్నాయ ని ఇందులో ప్రతి ఒక్కరికీ వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని లేకుంటే ఇంటి వద్దనే ఉండాలని కోరారు. 

Advertisement
Advertisement