రయ్‌.. రయ్‌..

ABN , First Publish Date - 2020-05-20T09:51:08+05:30 IST

సుధీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం నిబంధనలను మరింత సడలించడంతో పట్టణాలు, గ్రామాల్లో జనసందడి మొదలైంది. ముఖ్యంగా

రయ్‌.. రయ్‌..

ఉమ్మడి జిల్లాలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

తొలిరోజు ప్రయాణికులు అంతంతే..

తెరుచుకున్న దుకాణాలు 

సందడిగా పట్టణాలు, గ్రామాలు


58రోజుల తర్వాత రోడ్లపై జన సందడి కన్పించింది. లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో పట్టణాల్లో, గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఆటోలు, క్యాబ్‌లు రయ్‌రయ్‌మంటూ దూసుకుపోయాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో 100శాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చని సూచించడంతో ఉద్యోగులు విధుల్లో చేరారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు పట్టణాల్లో బట్టలు, చెప్పులు, నిత్యావసర దుకాణాలు, సెలూన్‌లు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : సుధీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం నిబంధనలను మరింత సడలించడంతో పట్టణాలు, గ్రామాల్లో జనసందడి మొదలైంది. ముఖ్యంగా 58రోజుల తరువాత ఆర్టీసీ సర్వీసులు పునఃప్రారంభించ డంతో  రోడ్లపై జనసంచారం పెరిగింది. హైద రాబాద్‌ సిటీ రీజియన్‌లో ఉన్న డిపోలకు చెందిన బస్సులు మినహా మిగతా అన్నిచోట్ల ఆర్టీసీ బస్సులు రోడ్లపై పరుగులు పెట్టాయి. ఆటోలు, కార్లకు అనుమతి ఇవ్వడంతో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. నగరశివార్లలో రోడ్లపై రద్దీ పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు దాదాపు పూర్తిస్థాయిలో పనిచేశాయి. కిరాణా షాపులు, సెలూన్లు, ఇతర అన్నిరకాల షాపులు తిరిగి ప్రారంభమయ్యాయి. చాలారోజుల తరువాత అనుమతి లభించడంతో యజమానులు తమ షాపులను క్లీన్‌ చేసి శానిటైజ్‌ చేసుకోవడం కనిపిం చింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో ప్రజ లంతా ఊపిరిపీల్చుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. 


ఇదిలాఉంటే తొలిరోజు అనేక రూట్లలో చాలా తక్కువ మంది ప్రయాణించారు. అంతంతమాత్రం జనంతోనే ఆర్టీసీ సర్వీసులు నడిచాయి. వలస కూలీలు అధికంగా ప్రయాణించారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు పనిచేస్తున్న ప్రాంతాల నుంచి నగరానికి చేరుకుని అక్కడ నుంచి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఎక్కారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు ఉదయం స్వల్పంగా కనిపించినప్పటికీ సాయంత్రం సంఖ్య పెరగడం గమనార్హం. ఆర్టీసీ సిబ్బందితోపాటు ప్రయాణికులు మాస్క్‌లు ధరించి భౌతికదూరం పాటించారు. ఆర్టీసీ డిపోల్లో శానిటైజర్‌ వ్యవస్థ ఎక్కడా కనిపించలేదు. కరోనా కట్టడికి సరైన రక్షణ చర్యలు కల్పించకపోవడం, శానిటైజర్లు ఇవ్వకపోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనతో ఉన్నారు.


రంగారెడ్డి రీజియన్‌లో గ్రామీణ ప్రాంత డిపోల్లో 60శాతానికిపైగా బస్సులు నడిచినట్లు అధికారులు తెలిపారు. నగరంలో సిటీ సర్వీసులు ఇంకా ప్రారంభించక పోవడంతో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారు బస్సుల్లో పరిమిత సంఖ్యలోనే వచ్చారు. షాద్‌ నగర్‌ డిపోలో 110 బస్సులు ఉండగా 70శాతానికి పైగా బస్సులు వివిధ రూట్లలో నడిచాయి. తాండూరు డిపోలో 98 బస్సులు ఉండగా ఇందులో 26 బస్సు సర్వీసులు హైదరాబాద్‌, మహ బూబ్‌నగర్‌, జహీరాబాద్‌, సంగారెడ్డి రూట్లలో నడిచాయి. ఇబ్రహీంపట్నం డిపో హైదరా బాద్‌ రీజియన్‌లో ఉండడంతో ఇక్కడ బస్సులు కదలలేదు. అయితే జీహెచ్‌ఎంసీ కార్మికులు, వైద్య సిబ్బంది తోపాటు ఇంటర్‌ ప్రశ్నాపత్రాలు దిద్దేందుకు వెళ్లే సిబ్బంది కోసం ఇక్కడ నుంచి 9 ప్రత్యేక బస్సులు నడిపారు. 


మేడ్చల్‌ జిల్లాలో..

హైదరాబాద్‌ రీజియన్‌లో ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో మేడ్చల్‌జిల్లా పరిధిలోని ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమ య్యాయి. ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్‌ వాహనాలకు అనుమతి లభించడంతో మేడ్చల్‌ జిల్లాలో రహదారులపై రద్దీ పెరిగింది. హైవేతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు సాగాయి. 


వికారాబాద్‌ జిల్లాలో..

వికారాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఎట్టకేలకు రోడ్డెక్కాయి.  వికారాబాద్‌ డిపోలో మొత్తం 79 బస్సులు ఉండగా మొదటిరోజు 32 బస్సులను అధికారులు నడిపారు. వికారాబాద్‌ నుంచి తాండూరు, పరిగి, శంకర్‌పల్లి, సదాశివపేటలకు నడవగా, హైదరాబాద్‌కు మాత్రం అప్ప జంక్షన్‌ వరకే అధికారులు బస్సులను నడిపారు. ఉదయం 6 గంటలకు డిపో నుండి బయటకు వచ్చిన బస్సులు సాయంత్రం 7 గంటల వరకు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చే ర్చాయి. 


భౌతికదూరం పాటించాలి: ఎమ్మెల్యే ఆనంద్‌

లాక్‌డౌన్‌ సడలింపు ఇవ్వడం వల్ల దుకాణాల వద్ద  ప్రజలు భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. మంగళవారం వికారా బాద్‌లోని ఆయా దుకాణాల వద్దకు వెళ్లి ఆయన పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తప్పనిసరిగా ప్రజలం దరూ మాస్కులు ధరించాలని సూచిం చారు. అనంతరం బస్టాండు రోడ్డులో నిర్మిస్తున్న సైడ్‌ డ్రైన్‌ పనులను పరిశీలించారు. ఆయన వెంట చిగుళ్లపల్లి రమేష్‌, లక్ష్మణ్‌, సుభాన్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-20T09:51:08+05:30 IST