వ్యాపార లావాదేవీల్లో తేడాలు.. రోడ్డుపై వెంటాడి మరీ కొడుక్కు నిప్పంటించిన తండ్రి.. చివరకు..

ABN , First Publish Date - 2022-04-09T00:33:55+05:30 IST

ఆయన ఒక వ్యాపారవేత్త. కొద్ది రోజుల క్రితం బిజినెస్ వ్యవహారాలను తన కొడుకు అప్పగించాడు. అనుభవం లేకనో లేక మరో కారణమో తెలియదు కానీ లెక్కల్లో తేడాలొచ్చాయి. దీంతో తండ్రి తీవ్ర ఆగ్రహానికి లోన

వ్యాపార లావాదేవీల్లో తేడాలు.. రోడ్డుపై వెంటాడి మరీ కొడుక్కు నిప్పంటించిన తండ్రి.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: ఆయన ఒక వ్యాపారవేత్త. కొద్ది రోజుల క్రితం బిజినెస్ వ్యవహారాలను తన కొడుకు అప్పగించాడు. అనుభవం లేకనో లేక మరో కారణమో తెలియదు కానీ లెక్కల్లో తేడాలొచ్చాయి. దీంతో తండ్రి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. రోడ్డుపై వెంటాడి మరీ కన్న కొడుక్కు నిప్పంటించాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బెంగళూరుకు చెందిన సురేంద్ర కొన్నేళ్లుగా ఫ్యాబ్రికేషన్ యూనిట్‌ను నడుపుతున్నాడు. కొద్ది రోజుల అతడి కొడుకు అర్పిత్‌ను దానికి ఇంచార్జిగా నియమించి కొన్ని  బాధ్యతలను అప్పగించాడు. ఈ క్రమంలో వ్యాపార లావాదేవీల్లో తేడాలొచ్చాయి. సుమారు రూ.1.5కోట్ల రూపాయలకు అర్పిత్ లెక్కలు చూపించలేకపోయాడు. అంతేకాకుండా అర్పిత్ రూ.12వేలను తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్టు సురేంద్ర గుర్తించాడు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికిలోనైన అతడు కన్న కొడుకును చంపేందుకు వెంటపడ్డాడు.



దీంతో ప్రాణ భయంతో అర్పిత్ పరుగులు తీశాడు. కానీ సురేంద్ర మాత్రం అతడిని వదల్లేదు. అర్పిత్‌ను వెంబడించి మరీ అతడికి నిప్పంటించాడు. ఈ క్రమంలో అర్పిత్ మంటలను ఆర్పుకునే ప్రయత్నం చేస్తూ రోడ్డుపై పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. 60శాతం శరీరం మంటల్లో కాలిపోవడంతో.. అర్పిత్ ఆసుపత్రిలో చికిత్స గురువారం మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సురేంద్రను అదుపులోకి తీసుకున్నారు. 






Updated Date - 2022-04-09T00:33:55+05:30 IST